PM Modi: భారత్ అభివృద్ధిని వందేభారత్ రైళ్లు ప్రతిబింబిస్తున్నాయి: మోదీ
భారత్ ఎంత వేగవంతంగా అభివృద్ధి చెందుతోందనే విషయాన్ని వందేభారత్ రైళ్లు ప్రతిబింబిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ముంబైలో ఇవాళ మోదీ రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. ముంబై-సాయినగర్ షిర్డీ, ముంబై-సోలాపూర్ మధ్య ఈ రెండు రైళ్లు నడుస్తాయి. దీంతో దేశంలో ప్రారంభమైన మొత్తం వందేభారత్ రైళ్ల సంఖ్య 10కి చేరింది. అనంతరం మోదీ మాట్లాడారు.

Oil and natural gas will play a crucial role in energy security: PM Modi
PM Modi: భారత్ ఎంత వేగవంతంగా అభివృద్ధి చెందుతోందనే విషయాన్ని వందేభారత్ రైళ్లు ప్రతిబింబిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ముంబైలో ఇవాళ మోదీ రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. ముంబై-సాయినగర్ షిర్డీ, ముంబై-సోలాపూర్ మధ్య ఈ రెండు రైళ్లు నడుస్తాయి. దీంతో దేశంలో ప్రారంభమైన మొత్తం వందేభారత్ రైళ్ల సంఖ్య 10కి చేరింది. అనంతరం మోదీ మాట్లాడారు.
వందేభారత్ రైళ్లు విద్యార్థులకు, కార్యాలయాలకు వెళ్లేవారికి, ప్రార్థనామందిరాలకు వెళ్లేవారికి, రైతులకు కూడా బాగా ఉపయోగపడతాయని చెప్పారు. పర్యాటకానికి కూడా ఊతం ఇస్తాయని అన్నారు. రెండు వందేభారత్ రైళ్లను ఒకేసారి ప్రారంభించడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో 108 జిల్లాల్లో వందేభారత్ సేవలు అందుతున్నాయని చెప్పారు.
వందేభారత్ రైలును నవీన భారతంలో అద్భుతమైన దృశ్యంగా మోదీ అభివర్ణించారు. తమ నగరాల్లోనూ వందేభాతర్ రైళ్లు తిరగాలని ఎంపీలు కూడా డిమాండ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో ఎంపీలు ఎక్స్ ప్రెస్ రైళ్ల హాల్టులు తమ ప్రాంతంలో కావాలని కోరేవారని చెప్పారు. ఇప్పుడు వందేభారత్ కు ఉన్న ప్రాధాన్యం వల్ల ఆ రైళ్లు కావాలని కోరుతున్నారని తెలిపారు. కాగా, దేశంలో మొత్తం 400 అత్యాధునిక వందేభారత్ రైళ్లను ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం 2022 బడ్జెట్ లో ప్రకటించింది.
Minister KTR Criticized : ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డగోలుగా అమ్మేస్తోన్న కేంద్రం : మంత్రి కేటీఆర్