రిక్షా పుల్లర్‌కు మోడీ లేఖ..ఎందుకో తెలుసా

రిక్షా తొక్కే కార్మికుడికి భారత ప్రధాన మంత్రి మోడీ లేఖ రాయడం ఏంటీ ? అంత విషయం ఏముంటుంది ? అని అనుకుంటున్నారా ? కానీ ఇది నిజంగానే జరిగింది. మోడీ రాసిన లేఖ చూసి ఆ రిక్షా కార్మికుడు ఎంతో సంబరపడిపోయాడు. ప్రధాన మంత్రి తనకు లేఖ రాశాడని..కుటుంబసభ్యులకు, స్నేహితులకు చూపిస్తూ..ఫుల్ ఖుష్ అయిపోయాడు. ఈ ఘటన వారణాసిలో చోటు చేసుకుంది.
మంగళ్ కెవాత్..వారణాసిలోని డోమ్రీ జిల్లాలో నివాసం ఉంటున్నాడు. ఇతను రిక్షా తొక్కుకుంటూ..జీవనం సాగిస్తున్నాడు. డోమ్రీ గ్రామం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దత్తత తీసుకున్నారు. అయితే..మంగళ్ కెవాత్ కూతురికి పెళ్లి చేయాలని భావించాడు. ఓ యువకుడితో వివాహం నిశ్చయించుకున్నారు. ఫిబ్రవరి 12వ తేదీన పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. బంధుమిత్రులందరికీ శుభలేఖలు పంపించారు. అయితే..కెవాత్ మిత్రులు..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కూడా ఆహ్వాన పత్రికలు పంపించాలని సూచించారు.
సరేనని..కెవాత్ ఒకటి ఢిల్లీకి, మరొకటి వారణాసి నియోజకవర్గంలోని కార్యాలయానికి పంపించాడు. వివాహం ఘనంగా జరుగుతోంది. అప్పుడే..పోస్ట్ మ్యాన్ ఇచ్చి..ఓ లెటర్‌ను అందచేశారు. విషయం ఏమిటో చూడాలని కెవాత్..తనవారికి ఇచ్చాడు. అది ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చిందని..నీకు..నీ కుమార్తెకు అభినందనలు తెలుపుతూ ఆశీస్సులు అందచేశారని ఓ వ్యక్తి చెప్పాడు.
ఒక్కసారిగా స్టన్ అయిన కెవాత్…ఫుల్ ఖుష్ అయిపోయాడు. పెళ్లి మండపంలోనే ఆ లేఖను అందరీకి చూపించాడు. ఈ విషయం కొద్ది రోజుల తర్వాత..బయటకు తెలిసిపోయింది. దీంతో మీడియా అతని ఇంటికి వచ్చి..ఎలా రెస్పాండ్ అవుతున్నారని ప్రశ్నించింది. మోడీ నుంచి లేఖ వస్తుందని అస్సలు ఊహించలేదని, తన కూతురిని ఆశీర్వదించినందుకు చాలా సంతోష పడుతున్నానని చెప్పాడు మంగళ్ కెయాత్.
మంగళ్..గంగా నదికి వీర భక్తుడు. సంపాదించిన కొంత భాగాన్ని నది ప్రార్థనలకు ఖర్చు చేస్తుంటాడు. స్వచ్చ భారత్‌లో కూడా చురుకుగా పాల్గొన్నాడు. సభ్యత ప్రచారం సందర్భంగా కెవాత్‌ను బీజేపీ సభ్యునిగా చేర్చుకున్నారు.
Read More : బిజీ షెడ్యూల్ : ఆఫీసులోనే IPS, IAS ఆఫీసర్ల పెళ్లి