పెద్ద ప్రమాదమే తప్పింది : దేవుడిలా వచ్చాడు.. గొడుగుతో రైలును ఆపాడు!
దేవుడిలా వచ్చాడు... వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను రక్షించాడు.

దేవుడిలా వచ్చాడు… వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను రక్షించాడు.
దేవుడిలా వచ్చాడు… వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను రక్షించాడు. రైల్వే ట్రాక్ పక్కన కూర్చొని ఉన్న కూరగాయల వ్యాపారి సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే.. రైలు పట్టాలు తప్పి భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేది. కనీసం 1.5 అడుగల వరకు ట్రాక్ తప్పి పోయింది.
ఈ ట్రాక్ పై రైలు ప్రయాణిస్తే.. క్షణాల్లో పట్టాలు తప్పి ఘోర ప్రమాదం జరిగేది. కూరగాయలమ్మే వ్యక్తి తన దగ్గరి గొడుగు సాయంతో ట్రైన్‌కు సిగ్నల్ ఇచ్చి ప్రమాదం జరగకుండా ఆపాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కంజుర్ మార్గ్, బండప్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది.
బద్లాపూర్ ట్రైన్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడానికి కొన్ని నిమిషాల ముందు భారీగా జెర్క్ ఇచ్చినట్టుగా గుర్తించామని ఎమర్జెన్సీ కంట్రోల్‌కు ఇంజిన్ డ్రైవర్ తెలిపాడు. అదే సమయంలో కూరగాయల వ్యాపారి గొడుగు పైకి ఎత్తి ట్రైన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇంజిన్ డ్రైవర్లు గుర్తించి వెంటనే బ్రేక్ వేసినట్టు తెలిపారు.
రైల్వే ట్రాక్ మిస్ కావడానికి గల కారణాలపై విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు విచారిస్తున్నారు. ట్రాక్ విరిగిపోయినట్టు ముందుగానే గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, లేదంటే ప్రయాణికులు ప్రాణాలు పోయేవని అధికారులు తెలిపారు. ట్రాక్ విరిగిన విషయాన్ని గుర్తించిన కూరగాయల వ్యాపారికి రైల్వే అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.