హై బ్లడ్ ప్రెజర్…హాస్పిటల్ లో కేరళ మాజీ సీఎం

హై బ్లడ్ ప్రెజర్…హాస్పిటల్ లో కేరళ మాజీ సీఎం

Achuthanandan

Updated On : May 18, 2021 / 2:32 PM IST

కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు,కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ శుక్రవారం(అక్టోబర్-25,2019)హాస్పసిటల్ లో చేరారు. తీవ్ర రక్తపోటు కారణంగా ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు పార్టీ తెలిపాయి. ఈ వార్తను తెలుసుకున్న సీఎం పినరయ్ విజయన్ వెంటనే హాస్పిటల్ కు చేరుకొని ఆయనను పరామర్శించారు. 2006-2011వరకు సీఎంగా పనిచేసిన వీస్ అచ్యుతానందన్ ఏడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఆయన  ప్రస్తుతం  పాలక్కాడ్ జిల్లాలోని మల్లంపూజా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఆదివారం ఆయన 96వ వసంతంలోకి అడుగుపెట్టారు. మంగళవారం(అక్టోబర్-21,2019)వట్టియూర్కావు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సీపీఐ-ఎమ్ అభ్యర్థి 34ఏళ్ల తిరువనంతపురం మేయర్ వీకే ప్రకాష్ తరపున అచ్యుతానందన్ ప్రచారం చేశారు. గురువారం వెలువడిన ఉప ఎన్నిక ఫలితంలో వీకే ప్రకాష్ గెలుపొందిన విషయం తెలిసిందే.