VC Jagdeep Dhankhar: ఇది నిజంగా ప్రజాస్వామ్య దేశమేనా? న్యాయవ్యవస్థ జోక్యాన్ని టార్గెట్ చేసిన ఉపరాష్ట్రపతి
ఏ వ్యవస్థ పని ఆ వ్యవస్థ చేయాలని ఆయన పరోక్షంగా అన్నారు. న్యాయపరమైన ఉత్తర్వులు రాసే అధికారం శాసనసభకు ఎలా లేదో, అలాగే చట్టాలు చేసే అధికారం కూడా న్యాయవ్యవస్థకు ఉండదని అన్నారు. ఈయన ప్రసంగానికి ముందు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన ప్రసంగంలో న్యాయశాఖ, శాసనసభ, కార్యనిర్వాహక శాఖలు ఒకరినొకరు గౌరవించుకోవాలని అన్నారు..

Vice President Jagdeep Dhankhar asks ‘are we a democratic nation’
VC Jagdeep Dhankhar: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థపై కొద్ది రోజుల క్రితం ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుటే ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా కొన్ని అంశాల్లో న్యాయవ్యవస్థ జోక్యంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అసదు ఇది ప్రజాస్వామ్య దేశమా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం అంటూ ఆయన తన విముఖతను వ్యక్తం చేశారు. 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఊటంకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Telangana New CS Shanti kumari : తెలంగాణ తొలి మహిళా సీఎస్‌గా శాంతి కుమారి .. బాధ్యతల స్వీకరణ
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన 83వ ఆల్-ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌లో మొదటిసారి ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ ప్రసంగించారు. ఈ సమావేశంలో పార్లమెంట్, న్యాయవ్యవస్థ మధ్య ఉండే అంతరాన్ని వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని ఆయన అన్నారు. పార్లమెంటరీ సార్వభౌమాధికారం, స్వయంప్రతిపత్తి విషయంలో రాజీపడటం కానీ, అనుమతి పొందాల్సిన అవసరం కానీ లేదని అన్నారు. అలా చేయాల్సి వస్తే అది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని అన్నారు.
ఏ వ్యవస్థ పని ఆ వ్యవస్థ చేయాలని ఆయన పరోక్షంగా అన్నారు. న్యాయపరమైన ఉత్తర్వులు రాసే అధికారం శాసనసభకు ఎలా లేదో, అలాగే చట్టాలు చేసే అధికారం కూడా న్యాయవ్యవస్థకు ఉండదని అన్నారు. ఈయన ప్రసంగానికి ముందు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన ప్రసంగంలో న్యాయశాఖ, శాసనసభ, కార్యనిర్వాహక శాఖలు ఒకరినొకరు గౌరవించుకోవాలని అన్నారు. న్యాయవ్యవస్థ అధికారాలను చట్టసభలు ఎప్పుడూ గౌరవిస్తాయని, రాజ్యాంగం ద్వారా నిర్దేశించిన అధికారాల విభజనను న్యాయవ్యవస్థ అనుసరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. మూడు శాఖలు పరస్పర విశ్వాసం, సామరస్యంతో పని చేయాలని ఓం బిర్లా అన్నారు.