Video clip: గోమూత్రంపై ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు వైరల్

ఓ సన్యాసికి తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు ఆయన గోమూత్రాన్ని సేవించారని, దీంతో అతడు కోలుకున్నాడని వి.కామకోటి ఓ పిట్టకథను వివరించారు.

Video clip: గోమూత్రంపై ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు వైరల్

Updated On : January 19, 2025 / 8:47 PM IST

గోమూత్రం గొప్పదనం గురించి చెబుతూ ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కామకోటి ఈ సందర్భంగా మాట్లాడారు.

దేశవాళీ జాతుల ఆవులను రక్షించడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై కామకోటి మాట్లాడుతూ అందులో భాగంగా గోమూత్రలోని ఔషధ విలువలను ప్రశంసించారు. ఓ సన్యాసికి తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు ఆయన గోమూత్రాన్ని సేవించారని, దీంతో అతడు కోలుకున్నాడని వి.కామకోటి ఓ పిట్టకథను వివరించారు.

గోమూత్రంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, డైజెస్టివ్ గుణాలు ఉన్నాయని కామకోటి చెప్పారు. గోమూత్రం ఇర్రిటేబుల్ బోవెల్‌ సిండ్రోమ్‌కి కూడా చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ఆవు మూత్రంలొ ఔషధ విలువలు ఉన్నాయని తెలిపారు. సేంద్రీయ వ్యవసాయ ప్రాధాన్యాన్ని వివరించి చెప్పారు. వ్యవసాయంలో, మొత్తం ఆర్థిక వ్యవస్థలో దేశీయ పశువులు పోషించే పాత్ర గురించి ఆయన మాట్లాడారు.

కామకోటి చేసిన వ్యాఖ్యలపై డీఎంకే నాయకుడు టీకేఎస్‌ ఎలంగోవన్ మండిపడ్డారు. దేశంలో విద్యను నాశనం చేయడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. కామకోటి చేసిన వ్యాఖ్యలపై మరికొందరు నేతలు ఆగ్రహ వ్యక్తం చేశారు.

Heavy traffic jam: విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీ రద్దీ