Viral Video : కొడుకుపై కత్తితో దుండగుల దాడి.. ప్రాణాలకు తెగించి కాపాడిన తల్లి..!
Viral Video : అదే సమయంలో స్పందించిన తల్లి తన కుమారుడిని ఆ దుండగుల దాడి బారి నుంచి రక్షించింది. దాడి చేసిన సమయంలో ఆ తల్లి ధైర్యంగా దుండగులను ఎదురించి కుమారుడి ప్రాణాలను కాపాడింది.

Video_ Maharashtra Woman Saves Son's Life, Chases Away 3 Men ( Image Source : Google )
Viral Video : మహారాష్ట్రలో పట్టపగలే ఓ యువకుడిపై కత్తితో దాడికి ప్రయత్నించారు ముగ్గురు దుండగులు. కానీ, అదే సమయంలో స్పందించిన తల్లి తన కుమారుడిని ఆ దుండగుల దాడి బారి నుంచి రక్షించింది. దాడి చేసిన సమయంలో ఆ తల్లి ధైర్యంగా దుండగులను ఎదురించి కుమారుడి ప్రాణాలను కాపాడింది.
Read Also : Viral Video : ఆపిల్ ఐఫోన్ కోసం కొడుకు నిరాహారదీక్ష.. కండిషన్ పెట్టి కొనిచ్చిన పూలు అమ్మే తల్లి..!
ఈ ఘటన నగరంలో ఆదివారం (ఆగస్టు 18) మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో కొల్హాపూర్‌లోని జైసింగ్‌పూర్ ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన ఘటన సీసీటీవీలో రికార్డయింది. షాకింగ్ వీడియోలో ఒక వ్యక్తి స్కూటర్‌పై రోడ్డు పక్కన కూర్చుని తల్లితో కబుర్లు చెబుతున్నాడు. కొద్దిసేపటికే, ముగ్గురు వ్యక్తులు స్కూటర్‌పై వచ్చి అతనిపై కత్తితో దాడి చేశారు.
అయితే, ఆ దాడి నుంచి ఆ వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. ఆ వ్యక్తి తల్లి వెంటనే స్పందించి దాడి చేసిన వారిపై విసరడానికి రాయిని తీసుకుంది. వెంటనే, ఆమె కొడుకు కూడా వారిపై తిరగబడ్డాడు. దాడి చేసిన వారిని తరిమికొట్టాడు. దాడికి పాల్పడిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
शख़्स ने बेटे के ऊपर हमला किया तो मां ने पत्थर हाथ में लेकर दौड़ा लिया…आप खुद देखिए बेटे के लिए मां ने गुंडे को कैसे खदेड़ा ❤️
वीडियो कोल्हापुर का बताया जा रहा है #Kolhapur pic.twitter.com/UpTndCtZ8L
— Ajeet Yadav (@ajeetkumarAT) August 19, 2024
పోలీసుల వివరాల ప్రకారం.. ఆ వ్యక్తి గతంలో నిందితుడితో గొడవపడి దాడికి పాల్పడ్డాడు. ఆ ఘటన జరిగినప్పుడు ఆ వ్యక్తి తండ్రి ఊరు బయట ఉన్నాడు. అవకాశం కోసం ఎదురుచూసిన ఆ ముగ్గురు వ్యక్తులు తల్లితో రోడ్డు పక్కన నిలబడగా బైక్ పై వచ్చి మరి దాడికి పాల్పడ్డారు. అదృష్టవశాత్తూ ఆ యువకుడికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also : Jharkhand Truck Driver : ట్రక్ డ్రైవర్.. వంటల వీడియోలతో ఫేమస్ అయ్యాడు.. నెలకు రూ. 10 లక్షలు సంపాదన..!