Elderly man dance viral : ‘కోయీ లడ్కీ హై’ అంటూ వృద్ధుడు చేసే డ్యాన్స్ చూడండి.. మీలో ఉత్సాహం వచ్చేస్తుంది
ఎప్పుడూ సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. వయసు మీద పడ్డా చురుగ్గా ఉంటారు. ఓ పెద్దాయనని చూస్తే అదే అనిపిస్తుంది. 'కోయీ లడ్కీ హై' అంటూ ఎంతో ఉత్సాహంగా స్టెప్పులు వేస్తున్న ఆయనని చూస్తే మనలో కూడా ఉత్సాహం రావడం ఖాయం.

Elderly man dance viral
Elderly man dance viral : జీవితంలో చిన్న చిన్న కష్టాలు వస్తే డీలా పడిపోతారు. అనుకున్నవి సాధించలేదని.. ఇంక ఏమీ చేయలేమని బాధపడతారు. అసలు డీలా పడటం వల్లే సగం డల్ అయిపోతాం. ఓ పెద్దాయన జీవితంలో ఎన్ని కష్టనష్టాలు చూసి ఉంటారో.. వయసు మీద పడ్డా ఆయనలో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. ‘కోయీ లడ్కీ హై’ అనే పాటకి హుషారుగా స్టెప్పులు వేస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు.
Elderly man song viral : పాత్రపై సంగీతం వాయిస్తూ పెద్దాయన పాడిన పంజాబీ పాట వినండి
తెల్లారితే ఆ బిల్లు కట్టాలి.. ఈ లోన్ కట్టాలి.. కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి.. ఇలా ఏదో ఒక సమస్యతో ప్రతి ఒక్కరిలోనూ నవ్వులు మాయం అయిపోతున్నాయి. మరి మీ మొహంపై నవ్వు తెప్పించే అద్భుతమైన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అందులో ఒకదాని గురించే ఇప్పుడు చెప్పబోయేది. ఓ గ్రూపు మగవారంతా కూర్చుని ఉన్నారు. ఓ పెద్దాయన ‘ దిల్ తో పాగల్ హై’ సినిమాలోని ‘కోయి లడ్కీ హై’ అనే పాటకు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా స్టెప్పులు వేశారు. ఆయన మొహంలో ఎంతో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ విజయ్ ఖరోటే (kharotevijay) పంచుకున్నారు. ఇక ఇంటర్నెట్‌లో నెటిజన్లు ఈయన స్టెప్పులు చూసి భలే మెచ్చుకున్నారు.
‘పెద్దాయన డ్యాన్స్ అద్భుతంగా ఉంది. నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది’ .. ‘మిమ్మల్ని దేవుడు ఇలాగే సంతోషంగా ఉండేలా ఆశీర్వదించాలి’ అంటూ కామెంట్లు పెట్టారు. వయసు మీద పడగానే ఇక జీవితమే అయిపోయిందని నిరుత్సాహపడేవారు ఈ పెద్దాయన డ్యాన్స్, ఆయన ఉత్సాహం చూస్తే నిజంగా స్ఫూర్తి పొందుతారనడంలో సందేహం లేదు.
View this post on Instagram