Viral Video : చెట్టు ఊపితే డబ్బులు రాల్తాయా? ఆ కుర్రాడు చేసిన పనికి…

చెట్లపై నుంచి డబ్బులు రాలుతుంటే విచిత్రంగా అనిపిస్తుంది. వెంటనే తీసుకోవాలనిపిస్తుంది. అలా ఓ యువకుడు తీసుకోవాలని ఆత్రంగా వెళ్లేసరికి.. ఏమైందంటే?

Viral Video : చెట్టు ఊపితే డబ్బులు రాల్తాయా? ఆ కుర్రాడు చేసిన పనికి…

Viral Video

Updated On : October 20, 2023 / 4:49 PM IST

Funny Prank Viral Video : డబ్బులు చెట్లకు కాస్తాయా? చెట్టు ఊపితే కరెన్సీ నోట్లు కింద పడతాయా? ఆశ పడి తీసుకోవాలనుకున్న ఓ కుర్రాడికి ఎలాంటి పరిస్థితి ఎదురైంది?

Man Prank Viral : చనిపోయినట్లు నమ్మించాడు.. అంత్యక్రియలకు రప్పించాడు.. కుటుంబ సభ్యులకు ప్రాంక్‌తో గుణపాఠం నేర్పిన వ్యక్తి

ఇదేదో సీరియస్ వార్త అనుకునేరు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఓ చిలిపి వీడియో గురించి. కొన్ని ప్రాంక్స్ చూడటానికి భలే అనిపిస్తాయి. అవి సరిగ్గా పేలకపోతే మామూలు రచ్చ జరగదు. కానీ అవి చేసేవారికి మాత్రం డేర్ ఉండాలి. మనం నిలబడిన చోట ఒక చెట్టు ఉండి.. దానిని ఊపుతుంటే కరెన్సీ నోట్లు రాలాయనుకోండి.. మనం తీసుకుంటాం.. ఇక చూసేవారు కూడా తీసుకోకుండా ఉంటారా? చెప్పండి. వైరల్ అవుతున్న ఓ ఫన్నీ ప్రాంక్ వీడియో గురించి చెప్పాలి.

పేవ్‌మెంట్ పక్కన ఉన్న ఓ చెట్టును యువకుడు తన్నడంతో వీడియో మొదలవుతుంది. అంతే చెట్టు‌పై నుంచి డబ్బులు రాల్తాయి. మరోసారి కాలితో తన్నగానే మరిన్ని నోట్లు పడతాయి. ఇదంతా చూస్తున్నవారికి ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. ఇదంతా గమనిస్తున్న ఓ యువకుడు ఆత్రం ఆపుకోలేక ఆశతో చెట్టును కదిలించడానికి ప్రయత్నించాడు. అంతే చెట్టుపై నుంచి అతని మీద నీళ్లు పడ్డాయి. ఇదంతా సరదాగా కొందరు చేసిన ప్రాంక్ అన్నమాట.

Delhi : డ్యూటీలో ఉన్న పోలీసు ఆఫీసర్‌ను చెంప‌ దెబ్బ కొట్టిన మహిళ.. ఆమె విపరీత ప్రవర్తనకు షాకైన నెటిజన్లు

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో అత్యాశ మంచిది కాదనే మంచి మెసేజ్ ఇస్తోందని నెటిజన్లు ప్రశంసించారు.

 

View this post on Instagram

 

A post shared by ????? ???????? (@nkzonekaran)