Tamil Nadu students: బస్సులోనే మద్యం తాగేస్తున్న స్టూడెంట్స్.. వైరల్‌గా మారిన వీడియో
స్కూల్ స్టూడెంట్స్ కదులుతున్న బస్సులో మద్యం తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమిళనాడులో చెంగళ్పట్లు జిల్లాలో బస్సెక్కిన విద్యార్థులు.. మద్యం తాగుతూ వీడియో తీసుకుంటూ

School Students
Tamil Nadu Students: స్కూల్ స్టూడెంట్స్ కదులుతున్న బస్సులో మద్యం తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమిళనాడులో చెంగళ్పట్లు జిల్లాలో బస్సెక్కిన విద్యార్థులు.. మద్యం తాగుతూ వీడియో తీసుకుంటూ హడావుడి చేశారు. ఇంకా ఆ వీడియోలో మగ పిల్లలతో కలిసి బీర్ ఓపెన్ చేయడం, తాగడం స్పష్టంగా కనిపించాయి.
ఆ స్టూడెంట్స్ అంతా చెంగళ్పట్టులోని గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల్లా కనిపించారు. ముందుగా అదేదో పాత వీడియో అనుకున్నా.. స్కూల్ యూనిఫామ్స్ ను బట్టి రీసెంట్ వీడియో అని తర్వాత తెలిసింది.
తిరుకఝుకుంద్రమ్ నుంచి తాచూర్‌కు వెల్లే బస్సులో స్టూడెంట్స్ తెలియడంతో జిల్లా ఎడ్యుకేషన్ అధికారి దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుంది. పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత సరైన చర్య తీసుకుంటామని అంటున్నారు.