ద్యావుడా..JCBని ఇలాక్కూడా వాడొచ్చా..!

జేసీబీని తవ్వకాలకు..మట్టిన చదును చేయటానికి వాడతారు. పదిమంది ఒక రోజంతా చేసే పని జేసీబీ ఒక్క గంటలో చేసేస్తుంది. కానీ జేసీబీని తవ్వకాల కోసమే కాదు మరోలా కూడా ఉపయోగించవచ్చనే ఐడియా గుజరాతీయులకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఇది చూసినవారంతా తెగ నవ్వేసుకంటున్నారు.
గుజరాత్ లో కొందరు మహిళలు లారీలో ఎక్కారు.. వారు కిందకు దిగాలంటే ఏ స్టూలో, కుర్చీనో, చిన్నపాటి నిచ్చెనో సాయంగా తీసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం మహిళల్ని లారీలో నుంచి జేసీబీతో కిందకు దించారు. జేసీబీకి ముందు ఉండే వెడల్పుగా ఉండే తొట్టెలాంటిదాన్ని డీసీఎం దగ్గరు చేర్చాడు జేసీబీ డ్రైవర్.
Also Read | 6ఏళ్ల చిన్నారికి సంకెళ్లు వేసి అరెస్ట్ చేసిన పోలీసులు..ఎందుకంటే
ఆ తొట్టిలోకి మహిళలు ఎక్కగానే..జేసీబీని దూరంగా నడిపి అక్కడ చక్కగా నేలపై దించేస్తున్నాడు డ్రైవర్. అలా జేసీబీ ద్వారా డీసీఎం నుంచి కిందకు దిగుతూ నవ్వు ఆపుకోలేకపోయారు ఆ మహిళలు. కిలకిలా నవ్వుకుంటూ కిందకు దిగారు. గుజరాత్‌లో జరిగిన ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్ గా మారింది.