పర్యాటకుల సఫారీ ట్రక్కుని తొండంతో ఎత్తిపడేసిన ఏనుగు.. వీడియో వైరల్

Viral Video: ట్రక్కును తొండంతో పట్టుకుని లాగసాగింది. దీంతో ట్రక్కులోని ప్రయాణికులు అందరూ భయంతో సీట్ల కింద దాక్కున్నారు.

పర్యాటకుల సఫారీ ట్రక్కుని తొండంతో ఎత్తిపడేసిన ఏనుగు.. వీడియో వైరల్

Viral Video

సఫారీ ట్రక్కుపై ఓ ఏనుగు దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాలోని పిలానెస్‌బర్గ్ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సఫారీ ట్రక్కులో పర్యాటకులు పార్క్‌లోని మృగాలను చూడడానికి వెళ్లారు. ఆ ట్రక్కుకు ఎదురుగా వచ్చిన ఓ ఏనుగు దాన్ని అడ్డగించింది.

ట్రక్కును తొండంతో పట్టుకుని లాగసాగింది. టక్కుని తొండంతో పైకి ఎత్తి వదిలేసింది. దీంతో ట్రక్కులోని ప్రయాణికులు అందరూ భయంతో సీట్ల కింద దాక్కున్నారు. ఏనుగును తరిమేయడానికి ట్రక్ డ్రైవర్ శబ్దాలు చేశాడు. చివరకు ఆ ఏనుగు ట్రక్కును వదిలేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటువంటి పార్కుల్లో పర్యాటకులకు మరింత రక్షణ కల్పించాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ భయానక అనుభవాన్ని పొందిన ఆ పర్యాటకులు మరోసారి నేషనల్ పార్కులకు వెళ్లబోరంటూ కొందరు కామెంట్లు చేశారు. నేషనల్ పార్కులకు వెళ్లేముందు ఇటువంటి వీడియో చూస్తే పర్యాటకులు తమ పర్యటనను వాయిదా వేసుకుంటారని ఓ నెటిజన్ అన్నాడు.

Prithviraj Sukumaran : సినిమా షూటింగ్ కోసం వెళ్లి.. కరోనా వల్ల మూడు నెలలు పాటు అరబ్ దేశ ఎడారిలో..