Welspun CEO అదరహో.. డ్యాన్స్ వేసి ఉద్యోగుల్లో జోష్

Welspun CEO అదరహో.. డ్యాన్స్ వేసి ఉద్యోగుల్లో జోష్

Updated On : February 19, 2020 / 2:35 PM IST

వెల్‌స్పన్ ఇండియా సీఈవో దీపాలీ గోయెంకా అదరగొట్టారు. ఆఫీసుకు వచ్చి ఎంప్లాయ్స్ వివరాలు అడిగి హుందాగా చైర్ లో కూర్చోలేదు. కింది ఉద్యోగులతో కలిసి స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ సినిమాలోని ముఖాబులా పాటకు డ్యాన్స్ చేశారు. ఆఫీసులో పాటకు డ్యాన్స్ చేసిన తీరుకు పొగడ్తలు అందుకున్నారు. 

ఆర్పీజీ ఎంటర్‌ప్రైజెస్ హర్ష్ గోయెంకా ఆమె వీడియోను ట్వీట్ చేయడంతో 2 రోజుల్లో 3 లక్షల్లో వ్యూస్ వచ్చాయి. హెల్తీ వర్క్ కల్చర్ తీసుకురావడానికి చైర్మన్ చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. ‘ఆఫీసులో ఓ సీఈఓ డ్యాన్స్ చేసి సరదాను సృష్టించడమనేది చాలా అరుదుగా చూస్తాం’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. దానికి బదులిచ్చిన దీపాలీ గోయెంకా.. వర్క్ ప్లేస్ సంతోషంగా ఉండటాన్ని ఇష్టపడతానన్నారు. 

అంతే కాకుండా.. ఆమె టైకూన్స్ ఆనంద్ మహీంద్రా, గౌతమ్ అదానీ, కిరన్ మజూందార్ షాలకు వీడియో ట్యాగ్ చేసి.. మీ సంగతేంటి అని ఛాలెంజ్ చేశారు. ఇక సోషల్ మీడియా వేదికగా గోయెంకాకు వేల కొద్ది లైకులు, వందల కొద్దీ కామెంట్ల వరద పారుతుంది. ఈ వెల్‌స్పన్ కంపెనీకి 50దేశాల్లో బ్రాంచులు, లక్షకు పైగా షేర్ హోల్డర్లు, 24వేల మంది ఉద్యోగులతో నడుస్తుంది. స్టీల్, ఎనర్జీ, టెక్స్‌టైల్ వంటి వాటిని ప్రొడక్ట్ చేస్తుంది.