PM Narendra Modi : మోడీ తెలుగు పాట పాడితే ఎలా ఉంటుందో విన్నారా? AI తో నెటిజన్లు చేస్తున్న మీమ్స్

ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుంది? తెలుగు సినిమా పాటలు పాడితే? .. ఎలా ఉంటుందో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని మీమ్స్ చూడండి.

PM Narendra Modi : మోడీ తెలుగు పాట పాడితే ఎలా ఉంటుందో విన్నారా? AI తో నెటిజన్లు చేస్తున్న మీమ్స్

PM Narendra Modi

Updated On : October 5, 2023 / 12:46 PM IST

PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఊహించాల్సిందే.. AI సాయంతో నెటిజన్లు అయితే మోడీని రాక్ స్టార్ చేసేసారు. అంతేనా మోడీ తెలుగు పాటలు పాడేస్తున్నట్లు వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఆ వీడియోలు భలే వైరల్ అవుతున్నాయి.

Viral News : వెడ్డింగ్ కేక్ వల్ల వారి పెళ్లి రద్దైంది.. ఇదేం విడ్డూరం? చదవండి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఇప్పుడు సాధ్యం కానిది ఏదీ లేదు. AI తో నెటిజన్లు అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు. గ్లోబల్ లీడర్లు రాక్ స్టార్లుగా మారిపోతున్నారు. సంగీత కచేరీలు కూడా చేసేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వీరంతా ఇప్పుడు AI తో రాక్ స్టార్లు అయిపోయారు.

నరేంద్ర మోడీ తెలుగులో మాట్లాడితే వినాలని చాలామందికి కోరిక ఉండొచ్చు. కానీ అది సాధ్యమయ్యే పనేనా? AI తో సాధ్యమేగా. మోడీ తెలుగు సినిమా పాటలు పాడేస్తున్నట్లు AI తో నెటిజన్లు మీమ్స్ రూపొందిస్తున్నారు. అలా రూపొందించిన మీమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని మోడీ కలిసిన వీడియోకు తెలుగు సినిమా పాటలు జత చేసి పోస్టు చేస్తున్నారు.

Viral Video : రన్నింగ్ బైక్ పై ముద్దులు .. ప్రేమ కాదు పైత్యం అంటున్న జనాలు

రాను రానంటూనే చిన్నది (జయం), నా వెంట పడి నువ్వెంత ఒంటరి (జాను), చూపే బంగారమాయేనా (పుష్ప) పాటలు మోడీ పాడుతున్నట్లు రూపొందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. నిజంగా నరేంద్ర మోడీ వాయిస్సా.. అన్నట్లు సింగర్ పాడటం కూడా విశేషం. ప్రస్తుతం ఈ వీడియోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు ఓ లుక్ వేయండి.