Vijaypat Singhania : నా కొడుకు నడిరోడ్డుపై ఉంటే సంతోషిస్తా.. గౌతమ్ సింఘానియాపై తండ్రి సంచలన కామెంట్స్

కొడుకు నడిరోడ్డుపై ఉంటే చూడాలని ఏ తండ్రి కోరుకోడు.. కానీ ఓ తండ్రి ఇలా కోరుకుంటున్నాడంటే ఎంతో మనోవేదన అనుభవించి ఉండాలి. కోట్లకు అధిపతులైనా బిడ్డలు తప్పు చేస్తే బయటకు చెప్పడం నిజంగా సాహసమని చెప్పాలి. ఓ తండ్రి తన బిడ్డ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేస్తున్నాయి.

Vijaypat Singhania : నా కొడుకు నడిరోడ్డుపై ఉంటే సంతోషిస్తా.. గౌతమ్ సింఘానియాపై తండ్రి సంచలన కామెంట్స్

Vijaypat Singhania

Updated On : November 24, 2023 / 5:32 PM IST

Vijaypat Singhania : రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా భార్య నవాజ్ మోదీ విడాకుల ఇష్యూ అందరికీ తెలిసిందే. తాజాగా గౌతమ్ తండ్రి విజయపత్ సింఘానియా కొడుకు గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

రేమండ్స్ ఫౌండర్ విజయపత్ సింఘానియా ఇటీవల తన కొడుకు విడాకుల అంశంతో పాటు అతనితో ఉన్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు. గౌతమ్‌కి ముందుగా ఆస్తులు ఇచ్చి పొరపాటు చేసానని విజయపత్ సింఘానియా విచారం వ్యక్తం చేసారు. అంతేకాదు గౌతమ్ నడిరోడ్డుపై ఉంటే సంతోషిస్తానంటూ ఆయన చెప్పడం అందరినీ ఆలోచనలో పడేసింది. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కొడుకు విడాకుల అంశంపై కూడా స్పందించారు.

Nawaz Modi : భర్తతో విడిపోతున్న నవాజ్ మోడీ ఎవరు? ఆమె గురించి ఆసక్తికరమైన విషయాలు

గౌతమ్-నవాజ్ మోదీ విడాకుల విషయంలో విజయపత్ సింఘానియా జోక్యం చేసుకోవడానికి ముందుకు వెళ్లారట. కోడలు నవాజ్ మోదీ ఈ విషయంలో ఎవరి జోక్యం వద్దని తిరస్కరించిదట. నవాజ్ మోదీ గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చిందని, ఆమె తండ్రి సీనియర్ న్యాయవాది అని.. నవాజ్ మోదీ కూడా లాయర్ కాబట్టి ఆమెకు అన్ని తెలుసని అన్నారాయన. ఆమె సాయం కోరి వస్తే తప్పకుండా సాయం చేస్తానని చెప్పారు విజయపత్ సింఘానియా. కొడుకు గురించి మాట్లాడిన విజయపత్ సింఘానియా గౌతమ్ తన మాట వినడని.. నచ్చనిది చెబితే తనపై అరుస్తాడని.. అందుకే తాను అతనికి దూరంగా ఉంటానని చెప్పారు. తన కోడలికే తన మద్దుతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

గౌతమ్ భార్య నవాజ్ మోదీ భరణంగా 75 శాతం వాటా డిమాండ్ చేసారు. దీనిపై కూడా విజయపత్ సింఘానియా మాట్లాడారు. గౌతమ్ అందుకు అంగీకరించకపోవచ్చునని.. ఒకవేళ నవాజ్ అనుకున్నది సాధించాలంటే ఆమె తరపున హరీష్ సాల్వే, ముకుల్ రోహత్గీ, కపిల్ సిబల్ వంటి న్యాయవాదులు పోరాడితే తప్ప న్యాయం జరగదని భావిస్తున్నట్లు చెప్పారు. గౌతమ్ ఎవరి మాట వినడని.. అవసరమైతే చట్టాన్ని కొనేస్తాడని చెప్పారు. తనను సొంత ఇంటి నుంచి వెళ్లగొట్టాడని, బంధువులతో రిలేషన్ లేదని చెప్పారు. పిల్లలకు ఆస్తులు పంచేముందు ప్రతి తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించుకోవాలని విజయపత్ సింఘానియా సూచించారు. వారు కోరుకున్నది ఇవ్వడంలో తప్పు లేదు కానీ.. ఆస్తులు మొత్తం ముందుగానే వారికి రాసిస్తే ఆ తరువాత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పారు.

Nawaz Modi : నా భర్త నుండి అంబానీలే కాపాడారంటూ.. గౌతమ్ సింఘానియా భార్య నవాజ్ మోదీ సంచలన ఆరోపణలు

40 లలో రేమండ్ చాలా చిన్న కంపెనీ. విజయపత్ సింఘానియా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వ్యాపారం విస్తరించింది. గౌతమ్ రేమండ్ నుండి విడిపోవడం బాధ కలిగించినా తాను జోక్యం చేసుకోబోనని విజయపత్ సింఘానియా చెప్పారు. తన కొడుకు గురించి అంత పెద్ద వ్యాపార వేత్త ఇలా చెప్పడం అందరినీ ఆలోచనలో పడేసింది. గౌతమ్ సింఘానియా ప్రవర్తనపైనా అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.