Manipur violence: మణిపూర్‭లో మళ్లీ చెలరేగిన హింస.. 17 మందికి తీవ్రగాయాలు, రాజధాని ఇంఫాల్‭లో కర్ఫ్యూ

ప్రభుత్వ యంత్రాంగం ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ సహా భిషంపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపును ఉపసంహరించుకుంది. ముందుజాగ్రత్త చర్యగా ఇంఫాల్ లోయ అంతటా రాత్రిపూట కర్ఫ్యూతో పాటు పగటిపూట ఆంక్షలు విధించారు.

Manipur violence: మణిపూర్‭లో మళ్లీ చెలరేగిన హింస.. 17 మందికి తీవ్రగాయాలు, రాజధాని ఇంఫాల్‭లో కర్ఫ్యూ

మణిపూర్ నుంచి అడపాదడపా హింసాత్మక నివేదికలు వెలువడుతున్నాయి. తాజాగా బిష్ణుపూర్ జిల్లాలో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. కంగ్వాయి, ఫౌగాచావో ప్రాంతాల్లో గురువారం హింస చెలరేగింది. కొంతమంది ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆర్మీ, ఆర్ఏఎఫ్ సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారని అధికారులు తెలిపారు. ఇక ఈ హింసలో 17 మంది ఆందోళనకారులు గాయపడ్డట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

Nuh violence : నుహ్‌లో కారుకు నిప్పు పెట్టిన దుండగులు.. తృటిలో తప్పించుకున్న మహిళా న్యాయమూర్తి, 3 ఏళ్ల చిన్నారి

ఇంతలో ప్రభుత్వ యంత్రాంగం ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ సహా భిషంపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపును ఉపసంహరించుకుంది. ముందుజాగ్రత్త చర్యగా ఇంఫాల్ లోయ అంతటా రాత్రిపూట కర్ఫ్యూతో పాటు పగటిపూట ఆంక్షలు విధించారు. మరోవైపు మణిపూర్‌ హింసాకాండపై పార్లమెంటులో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. గురువారం కూడా పార్లమెంట్‌లో విపక్షాలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో పార్లమెంట్‌ కార్యకలాపాలను వాయిదా వేయాల్సి వచ్చింది.

మణిపూర్ హైకోర్టు కీలక ఆదేశాలు
మరోవైపు, మణిపూర్ హైకోర్టు గురువారం తెల్లవారుజామున కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతిపాదిత భూమికి సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. హింసాకాండలో మరణించిన కుకీ వర్గానికి చెందిన వారి మృతదేహాలను ఈ భూమిలో ఖననం చేయాలన్నారు. అలా చేయడం వల్ల ఇప్పటికే అస్థిరమైన శాంతిభద్రతల పరిస్థితి మరింత దిగజారుతుందని హైకోర్టు పేర్కొంది.