Viral Video: స్థానికులను కారుతో ఢీకొడుతూ బీభత్సం సృష్టించిన అక్కాచెల్లెళ్లు

భవ్య జైన్ (23), చార్వి జైన్ (21) అనే అక్కాచెల్లెళ్లు తమ కారును నివాస ప్రాంతంలో చాలాసేపు ఆపకుండా హారన్‌ కొట్టారు.

Viral Video: స్థానికులను కారుతో ఢీకొడుతూ బీభత్సం సృష్టించిన అక్కాచెల్లెళ్లు

Updated On : November 3, 2024 / 9:45 PM IST

స్థానికులను కారుతో ఢీకొడుతూ బీభత్సం సృష్టించారు ఇద్దరు అక్కాచెల్లెళ్లు. తూర్పు ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ కెమెరాల్లో చిక్కింది. ఆ అక్కాచెల్లెళ్లు సృష్టించిన అలజడి చూసి స్థానికులు భయపడిపోయారు. వారి కారుని కొందరు తరిమారు.

భవ్య జైన్ (23), చార్వి జైన్ (21) అనే అక్కాచెల్లెళ్లు తమ కారును నివాస ప్రాంతంలో చాలాసేపు ఆపకుండా హారన్‌ కొట్టారు. దీంతో హారన్‌ ఆపాలని అశోక్‌ వర్మ (70) అనే రిటైర్డ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ వారికి చెప్పాడు. దీంతో శర్మకు ఇంటి వద్ద పూల కుండీలను పగలగొట్టిన ఆ అక్కాచెల్లెళ్లు, అనంతరం ఆయన ఇంట్లోకి ప్రవేశించి కత్తితో బెదిరించారు.

దీంతో శర్మ పోలీసులకు ఫోన్‌ చేశారు. పోలీసులు వచ్చాక కొన్ని గంటల పాటు ఆ అక్కాచెల్లెళ్లు ఇంట్లోనే తాళం వేసుకుని కూర్చున్నారు. చివరకు బయటకు దూసుకొచ్చి తమ కారులో కూర్చున్నారు.

కారును స్టార్ట్‌ చేసి వేగంగా తీసుకెళ్లి, అక్కడ ఉన్నవారిని ఢీకొట్టారు. అక్కడి పలు వాహనాలను కూడా ఢీ కొట్టారు. గేట్ బ్యారియర్‌ను పగులగొట్టారు. కొందరు స్థానికులకు గాయాలయ్యాయి. చివరకు అక్కాచెల్లెళ్లు ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. గతంలోనూ ఈ అక్కాచెల్లెళ్లు ఇలాంటి దురుసు ప్రవర్తనే ప్రదర్శించి, స్థానికులతో తిట్లు తిన్నారు.

Viral Video: రోడ్డుపై టపాసులు కాల్చుతున్న యువకుడిని ఢీకొట్టి దూసుకెళ్లిన కారు