Viral Video: స్టేజీపై ఈ యువకుడు జై శ్రీరాం అన్నందుకు.. ఏం జరిగిందో చూడండి..

ఇప్పటికే ఇద్దరు ప్రొఫెసర్లపై కాలేజీ అధికారులు చర్యలు తీసుకున్నారు. వారిద్దరిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

Viral Video: స్టేజీపై ఈ యువకుడు జై శ్రీరాం అన్నందుకు.. ఏం జరిగిందో చూడండి..

Ghaziabad college student

Updated On : October 21, 2023 / 9:22 PM IST

Jai Shri Ram on stage: కాలేజీ ఫెస్ట్‌లో స్టేజీపై ఓ యువకుడు జై శ్రీరాం అని నినదించాడు. దీంతో అతడిని స్టేజీపై నుంచి దించేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో ఏబీఈఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో చోటుచేసుకుంది. ఆ కాలేజీలో తాజాగా ఫెస్ట్ నిర్వహించారు. విద్యార్థులు అందరూ ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఇందులో పాల్గొంటున్నారు. ఓ విద్యార్థి స్టేజీ ఎక్కి తన ప్రదర్శనను ప్రారంభిస్తున్న సమయంలో కింది నుంచి కొందరు తోటి విద్యార్థులు జై శ్రీరాం అని నినాదాలు చేశారు.

దీంతో స్టేజీపై ఉన్న విద్యార్థి కూడా జై శ్రీరాం ఫ్రెండ్స్ అని మైకులో రిప్లై ఇచ్చాడు. ఆ వెంటనే అతడిని ఓ ప్రొఫెసర్ స్టేజీపై నుంచి కిందికి దిగాలని ఆదేశించారు. ఇది సాంస్కృతిక కార్యక్రమమని, అటువంటి నినాదాలు చేయకూడదని ఆ ప్రొఫెసర్ తిట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఘజియాబాద్ పోలీస్ కమిషనర్ దీనిపై స్పందించారు.

ఆ ఘటనపై దర్యాప్తు చేయాలని సంబంధిత పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. కాగా, జై శ్రీరాం నినాదం చేసినందుకు విద్యార్థిని స్టేజీ దిగాలని చెప్పిన ప్రొఫెసర్ తో పాటు మరో ప్రొఫెసర్ పై కాలేజీ అధికారులు చర్యలు తీసుకున్నారు. వారిద్దరిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

PARVA : కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ మహాభారతం.. ‘పర్వ’ టైటిల్‌తో మూడు భాగాలుగా..