Birds Viral Video : తన పార్టనర్ చనిపోతే ఆ పక్షి ఏం చేసిందో చూడండి.. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద షేర్ చేసిన ఎమోషనల్ వీడియో

ఒకరి కోసం ఒకరు జీవించడం.. ఒకరి కోసం ఒకరు మరణించడం ఇవన్నీ మనుష్యుల్లో మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటు. జంతువులు, పక్షుల్లో కూడా ప్రేమ ఉంటుంది. విడదీయరాని బంధం ఉంటుంది. తన పార్టనర్ చనిపోతే ఓ పక్షి ఏం చేసిందో తెలిస్తే మీ మనసు చలించిపోతుంది.

Birds Viral Video : తన పార్టనర్ చనిపోతే ఆ పక్షి ఏం చేసిందో చూడండి.. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద షేర్ చేసిన ఎమోషనల్ వీడియో

Birds Viral Video

Updated On : June 23, 2023 / 1:30 PM IST

Birds Viral Video : మనుష్యుల మధ్యనే కాదు జంతువులు, పక్షుల మధ్య ప్రేమ, బంధం ఉంటుంది. తాము ఎంతగానో ప్రేమించే తమ పార్టనర్ చనిపోతే అవి కూడా తట్టుకోలేవు. తన పార్టనర్ చనిపోతే ఓ పక్షి ఎంతగా తట్టుకోలేకపోయిందో.. చివరికి ఏమైందో చూస్తే కన్నీరు ఆగదు. ఇండియన్ ఫార్టెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ ఎమోషనల్ వీడియో ప్రేమ గొప్పతనాన్ని చాటి చెబుతోంది.

Old Man Married To Girlfriend: ప్రేమంటే అంతేమరి..! 93ఏళ్ల వయస్సులో ప్రియురాలిని పెళ్లాడిని వ్యోమగామి

మనుష్యుల్లో మాత్రమే భావోద్వేగాలు ఉంటాయని.. వారిలోనే ప్రేమాను బంధాలు ఉంటాయి అనుకోవడం పొరపాటు. మూగజీవాల్లో కూడా తమ వారిపట్ల విపరీతమైన ప్రేమ, అభిమానం ఉంటాయి. అవి కూడా ఒకరిని ఒకరు విడిచి బతకలేనంతగా జీవిస్తాయి అనడానికి రెండు పక్షల కథ ఉదాహరణ. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద ట్విట్టర్‌లో (@susantananda3) షేర్ చేసిన ఓ వీడియో ప్రేమ యొక్క గొప్పతనాన్ని, శక్తిని నిరూపించింది. ఒక పక్షి చనిపోయింది. దానిని అక్కడనుంచి తరలించడానికి ప్రయత్నించినపుడు దాని పార్టనర్ అడ్డుకుంటుంది. బలవంతంగా తరలించాలనుకున్నప్పుడు ఆ పక్షిని గట్టిగా అంటిపెట్టుకుని ఉంటుంది. ఈ దృశ్యం హృదయాన్ని కదిలించింది.

 

తన పార్టనర్ నుంచి విడిపోవడానికి ఆ పక్షి ఎంతగా ఇష్టపడట్లేదో మనకి వీడియో చూస్తే అర్ధం అవుతుంది. వీడియో చివరి వరకూ చూస్తే చనిపోయిన పక్షిని అంటిపెట్టుకుని ఉన్న ఆ పక్షి కూడా చనిపోయింది. రెండు పక్షులను కలిపి పాతిపెట్టడం మనకు కనిపిస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్ల మనసు చలించిపోయింది. ‘ఆ పక్షి గుండె తట్టుకోలేక చనిపోయింది’ అని ఒకరు.. ‘నాకు కన్నీరు ఆగట్లేదు’ అని మరొకరు వరుసగా తమ భావోద్వేగాలను పంచుకున్నారు.

pakistan : ‘ప్రేమంటే ఇదేరా’..ఇంట్లో పనిచేసే వ్యక్తిని పెళ్లి చేసుకున్న శ్రీమంతురాలు..

ప్రేమతో ఆ పక్షుల మధ్య పెనవేసుకున్న బంధం.. చివరికి ఒకరు లేకపోతే మరొకరు బతకలేనంతగా బలపడింది. అందుకే ఒక పక్షి మరణం తట్టుకోలేక మరో పక్షి గుండె ఆగింది. ఎంత గొప్ప ప్రేమ.. మనసున్న ప్రతి ఒక్కరిని ఈ వీడియో ఖచ్చితంగా కదిలిస్తుంది.