Viral Video: రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయిన వజ్రాలు.. వీడియో చూడండి, జనాలు ఎలా ఎగబడ్డారో?
వజ్రాల కోసం జనాలు ఎలా ఎగబడ్డారో వీడియోలో చూడొచ్చు. అందరూ కూర్చుని వీలైనన్ని ఎక్కువ వజ్రాలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరికి వజ్రాలు లభించగా, కొంతమందికి ఒక్క వజ్రం కూడా లభించలేదు.

Surat Viral Video: అలా రోడ్డు వెంట పోతుంటే వజ్రాలు దొరికితే ఎలా ఉంటుంది? ఊహించడానికే ఒక రకంగా ఉంది కదా.. డైమండ్ సిటీ సూరత్ లో ఇలాంటిదే జరిగింది. రోడ్డుపై వజ్రాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. చిన్న చిన్న వస్తువులు దొరుకుతున్నాయంటేనే జనాలు కంట్రోల్ లో ఉండరు. ఏకంగా వజ్రాలే పోయాయంటే ఇక ఊరుకుంటారా? ఎగబడి ఎగబడి వాటిని ఏరుకున్నారు. కొందరికి దొరికాయి, మరికొందరికి నిరాశే మిగిలింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో వజ్రాల మార్కెట్ జరిగే మహిధర్‌పురా, వరచా ప్రాంతానికి చెందిుది. ఇక్కడ ప్రజలు ఫుట్‌పాత్‌పై కూర్చొని వజ్రాలను విక్రయిస్తారు. ప్రజలు నడిచేటప్పుడు వాటిని కొనుగోలు చేస్తారు.
అసలేం జరిగిందంటే.. డైమండ్ మార్కెట్‌లో రోడ్డుపై వజ్రాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని ప్రజలకు సమాచారం అందింది. ఈ వార్త విన్న వెంటనే, రోడ్డుపై ఉన్న వజ్రాల్ని సొంతం చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. దుకాణదారులు, సాధారణ ప్రజలు, ప్రతి ఒక్కరూ తమ పనులు వదిలేసి రోడ్డుపై వజ్రాల్ని వెతికే పనిలో నిమగ్నమయ్యారు. కొద్దిసేపటికే మార్కెట్ రద్దీగా మారింది. పిల్లలు, స్త్రీలు, పురుషులు, ప్రతి ఒక్కరూ వజ్రాలను సొంతం చేసుకుని ధనవంతులు కావాలని కలలు కన్నారు. ఈ ఘటనను కొంత మంది వీడియో తీశారు.
ये हीरे ढूंढने की मशक्कत है!
दरसल, सूरत में हीरों का पैकेट सड़क पर गिर जाने की अफवा फैल गई
और फिर लोग हीरे की खोज करने लगे
कुछ लोगों को हीरे मिले भी….लेकिन अफसोस…वो नकली थे…#Diamonds #Surat #jewellery pic.twitter.com/uaKg4A5Rlk
— Archana Pushpendra (@margam_a) September 25, 2023
వజ్రాల కోసం జనాలు ఎలా ఎగబడ్డారో వీడియోలో చూడొచ్చు. అందరూ కూర్చుని వీలైనన్ని ఎక్కువ వజ్రాలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరికి వజ్రాలు లభించగా, కొంతమందికి ఒక్క వజ్రం కూడా లభించలేదు. బంపర్ డైమండ్స్ పొందిన వారు ఇప్పుడు తమ అదృష్టం వెలవెలబోతోందని భావించి సంతోషం వ్యక్తం చేశారు. కైవసం చేసుకున్న వజ్రాలు నిజమా, నకిలీవా అని తనిఖీ చేయగా, అందరూ షాక్‌కు గురయ్యారు. దోచుకెళ్లిన వజ్రాలు అంత విలువైన వజ్రాలు కావట. అవి అమెరికాకు చెందిన వజ్రాలేనని దర్యాప్తులో తేలింది. దీని ధర నిజమైన వజ్రం కంటే చాలా తక్కువ. వీటిని కిలో ధరకు విక్రయిస్తున్నారు. పోటీ పడి వజ్రాలను ఏరుకున్న వారి ముఖాల్లో ఒక్కసారిగా రంగు మారిపోయింది.