Viral Video: రష్యా అమ్మాయిని నడిరోడ్డుపై వేధించిన భారతీయ యువకుడు.. యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేసిన యువతి
‘నువ్వు మస్తున్నవు’ అని ఆ యువకుడు అనేసరికి ఆమెకు...

Koko in India
Viral Video: ఢిల్లీలోని సరోజినీ నగర్ మార్కెట్లో తనకు వేధింపులు ఎదురయ్యాయని రష్యాకు చెందిన ఓ అమ్మాయి వీడియో పోస్ట్ చేసింది. ఆ యువతికి కొకొ ఇన్ ఇండియా అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. భారత్‌లోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ఆమె అక్కడి విశేషాలను పోస్ట్ చేస్తుంటుంది.
తాజాగా ఆమె ఢిల్లీలో వీడియోలు తీసుకుంటుంది. ‘నేను ప్రస్తుతం సరోజిని నగర్ లో ఉన్నాను ఫ్రెండ్స్’ అని చెబుతూ ఆమె ముందుకు నడుస్తుంది. ఇంతలో ఓ యువకుడు ఆమె వెంటపడ్డాడు. అనంతరం ఆమెతో మాట్లాడుతూ, తాకుతూ వేధించాడు. తనతో స్నేహం చేయాలని కోరాడు.
‘నువ్వు ఎవరో నాకు తెలియదు కదా?’ అని ఆమె అంది. ఆ యువకుడి తీరు నచ్చక ఆ యువతి అతడి నుంచి దూరంగా వెళ్లడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ ఆమె వెంటే వస్తూ వేధించాడు. ‘మనం ఫ్రెండ్స్ అయ్యాక ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది’ అని ఆ యువకుడు అన్నాడు.
తనకు కొత్త ఫ్రెండ్స్ ఎవరూ వద్దని ఆమె చెప్పింది. ‘నువ్వు మస్తున్నవు’ అని ఆ యువకుడు అనేసరికి ఆమెకు చిరాకు వేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తన యూట్యూబ్ ఛానెల్ కొకొ ఇన్ ఇండియాలో బాధిత యువతి ఈ వీడియోను పోస్ట్ చేసింది.
Heart Attack : గుజరాత్ లో నవరాత్రి వేడుకల్లో విషాదం.. గర్భా ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి