Madhya Pradesh : పెళ్లికి ముందే ఉజ్జయినీ మహాకాళేశ్వర్ టెంపుల్‌లో పరిణీతి, రాఘవ్ చద్దా.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు

ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఉజ్జయినీ మహాకాళేశ్వర్ టెంపుల్‌ను సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈ జంట ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

Madhya Pradesh : పెళ్లికి ముందే ఉజ్జయినీ మహాకాళేశ్వర్ టెంపుల్‌లో పరిణీతి, రాఘవ్ చద్దా.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు

Madhya Pradesh

Updated On : August 27, 2023 / 8:57 AM IST

Madhya Pradesh : ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, ఆయన కాబోయే భార్య , నటి పరిణీతి చోప్రా మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ జంట ఆలయం లోపల కూర్చున్న ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

Parineeti Chopra : పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఎంగేజ్మెంట్ ఫోటోలు..

పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వచ్చిన ఇద్దరు పూజలు నిర్వహించి అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ పూజారి యశ్ గురు ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. శ్రావణమాసం సందర్భంగా ఆలయం రద్దీగా ఉంది. స్వామివారి ఆశీర్వాదం కోసం చాలామంది ప్రముఖులు ఆలయానికి వస్తున్నట్లు పూజారి చెబుతున్నారు.

Parineeti Chopra : పెళ్ళికి పిలుస్తారా అంటూ ఫోటోగ్రాఫర్ ప్రశ్న.. సిగ్గుపడ్డ పరిణీతి, రాఘవ్ చద్దా.. వీడియో వైరల్!

రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా ఉజ్జయినిలో మహాకాల్‌కు వెళ్లేముందు  అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయానికి వెళ్లారు. గురుద్వారాలో ప్రార్థనలు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ జంట తమ పర్యటనలోని ఫోటోలను తమ పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఢిల్లీలో పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా నిశ్చితార్ధం జరిగింది. త్వరలో ఉదయ్‌పూర్‌లోని ది ఒబెరాయ్ ఉదయవిలాస్‌లో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.