100రోజుల పాలనపై మోడీ : చూసింది ట్రైలరే…పిక్చర్ అబీ బాకీ హై

త్వరలో ఎన్నికలు జరుగనున్న జార్ఖండ్ లో గురువారం ప్రధాని మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా పలు పథకాలను ప్రారంభించిన మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ 100రోజుల పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని,అసలు సినిమా ముందుందని అన్నారు. ఎన్నికల సమయంలో పని చేసే సత్తా ఉన్న, దమ్మున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తాను ప్రజలకు మాటిచ్చానని అందుకు అనుగుణంగానే ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
ఎన్డీయే -2 పాలనలో ప్రజలకు సమర్థవంతమైన పాలన అందిస్తున్నామన్నారు. వేగంగా..కచ్చితంగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వంగా గుర్తింపు సాధించామన్నారు. ప్రజలను దోచుకున్న వారిని సరైన స్థానాలకు పంపిస్తామని, ఆ ప్రకియ కూడా మొదలైందని, ఇప్పటికే కొందరు జైలుకి కూడా వెళ్లారని తెలిపారు.
తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తాము సంక్పలించుకున్నామని.. అందులో భాగంగా తీవ్రవాద నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేశామని మోడీ తెలిపారు. ఆర్టికల్ 360 రద్దు చేసి జమ్మూ కశ్మీర్ ను శాశ్వతంగా భారత భూభాగంగా చేశామన్నారు. జమ్మూకశ్మీర్, లడక్ లో అభివృద్ధిని నూతన శిఖరాలకు తీసుకెళ్లాలని సంకల్పించుకున్నామన్నారు. త్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చి ముస్లిం మహిళలకు అండగా నిలిచామన్నారు