Corona Vaccination : ఇమ్యూనిటీ పెరగాలంటే మరో బూస్టర్ డోస్ – రణదీప్ గులేరియా

కరోనా మహమ్మారిలో మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని.. వాటి కట్టడికి బూస్టర్ డోసులు అవసరం పడతాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా చాలామందిలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతున్న సమయంలో కొత్త వేరియంట్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు

Corona Vaccination :  ఇమ్యూనిటీ పెరగాలంటే మరో బూస్టర్ డోస్ – రణదీప్ గులేరియా

Corona Vaccine (2)

Updated On : July 24, 2021 / 12:23 PM IST

Corona Vaccination : కరోనా మహమ్మారిలో మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని.. వాటి కట్టడికి బూస్టర్ డోసులు అవసరం పడతాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా చాలామందిలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతున్న సమయంలో కొత్త వేరియంట్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కరోనా కారణంగా దేశంలోని చాలామందిలో వ్యాధినిరోధక శక్తి తగ్గుతూ వస్తుందని, కొత్త వేరియంట్లు ఎటాక్ చేస్తే తట్టుకోవడం కష్టమని అభిప్రాయపడ్డారు. కొత్తవేరియంట్లను తట్టుకునేందుకు బూస్టర్ డోసులు అవసరం పడతాయని తెలిపారు.

ఈ ఏడాది చివరి నాటికి బస్టర్ డోసులు రాబోతున్నట్లు ఆయన తెలిపారు. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచి అన్ని రకాల వేరియంట్లను సమర్థవంతంగా ఎదురుకునేందుకు సహకరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాగానే బస్టర్ డోసులు పంపిణి ఉంటుందని ఆయన వెల్లడించారు.

చిన్నారుల వ్యాక్సిన్ ఈ ఏడాదిలోనే అందుబాటులోకి రానుందని, దానికి సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయని సెప్టెంబర్ నాటికి వాటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని గులేరియా పేర్కొన్నారు. చిన్నారుల వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే దశలవారీగా పాఠశాలలు తెరిచేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు.