Bengal Election Results 2021 : టీఎంసీ హ్యాట్రిక్ విక్టరీ.. మళ్లీ దీదీకే బెంగాల్ పీఠం

బెంగాల్ పీఠం మరోసారి దీదీకే దక్కనుంది. మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ హ్యాట్రిక్ విక్టరీ దిశగా అడుగులు వేస్తోంది. పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీ వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టనుంది. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా అందరి చూపు మాత్రం బెంగాల్ పైనే ఉంది. ఇక్కడ టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరి పోరు నడిచింది. ఈ పోరులో మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.

Bengal Election Results 2021 : టీఎంసీ హ్యాట్రిక్ విక్టరీ.. మళ్లీ దీదీకే బెంగాల్ పీఠం

Bengal Election Results

Updated On : May 2, 2021 / 12:40 PM IST

Bengal Election Results 2021 : బెంగాల్ పీఠం మరోసారి దీదీకే దక్కనుంది. మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ హ్యాట్రిక్ విక్టరీ దిశగా అడుగులు వేస్తోంది. పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీ వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టనుంది. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా అందరి చూపు మాత్రం బెంగాల్ పైనే ఉంది. ఇక్కడ టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరి పోరు నడిచింది. ఈ పోరులో మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.

మొత్తం 292 అసెంబ్లీ స్ధానాలకు గాను టీఎంసీ 187 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ కేవలం 98 స్ధానాల్లోనే ఆధిక్యం కనబరుస్తోంది. ఇతరులు నాలుగు స్ధానాల్లో ముందంజలో ఉన్నారు. కాగా, గతంతో పోలిస్తే బెంగాల్ లో బీజేపీ బలంగా పుంజుకుంది. 2016లో మూడు స్థానాలతోనే బీజేపీ సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం సత్తా చాటింది.

బెంగాల్ లో సంపూర్ణ ఆధిక్య దిశగా అధికార టీఎంసీ వెళ్తుండగా, నందిగ్రామ్ లో సీఎం మమతా బెనర్జీ వెనుకంజలో ఉండటం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి దీదీకి చుక్కలు చూపిస్తున్నారు. సువేందు అధికారి ప్రస్తుతం 8వేల ఓట్ల ఆధిక్యం ఉన్నారు.