మోడీ సర్కార్ పై రాహుల్ ఫైర్…ఫూలిష్ సిద్దాంతాలు అక్కర్లేదు

  • Published By: venkaiahnaidu ,Published On : September 12, 2019 / 09:41 AM IST
మోడీ సర్కార్ పై రాహుల్ ఫైర్…ఫూలిష్ సిద్దాంతాలు అక్కర్లేదు

Updated On : September 12, 2019 / 9:41 AM IST

ఆర్థికవ్యవస్థ గురించి మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. సమస్య ఉందని గుర్తిండంలో మోడీ సర్కార్ ఫెయిల్ అయిందని రాహుల్ ఆరోపించారు. ఐదేళ్ల కనిష్ఠానికి ఆర్థికవ్యవస్థను దిగజారుస్తూ 5ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం అంటూ మోడీ సర్కార్ ప్రజలకు అబద్దాలు చెబుతోందని రాహుల్ ఆరోపించారు.

భారతదేశానికి కావాల్సింది ప్రచారం, మభ్యపెట్టే వార్తా కథనాలు,నిర్మలా సీతారామన్ చెప్పిన మిలీనియల్స్ వంటి అవివేక సిద్ధాంతాలు కాదని, ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టే దృడమైన ప్రణాళికపై దృష్టి పెట్టాలని రాహుల్ ట్వీట్ చేశారు. సమస్య ఉందని గుర్తించడం ప్రారంభించడానికి మంచి ప్లేస్ అని రాహుల్ గాంధీ ట్వీట్ లో తెలిపారు.

రెండు రోజుల క్రితం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ… రోజుల్లో యువత ఓలా, ఉబెర్ లాంటి క్యాబ్స్‌ ను ఆశ్రయిస్తున్నారని, సొంతకార్లు కొనుక్కొని EMI భారం మోసేందుకు ఇష్టపడటం లేదని, మిలీనియల్స్(యువత) క్యాబ్స్‌లకే మొగ్గుచూపుతుండటం వల్లే ఆటోమొబైల్ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతోందని అన్నారు.

బీఎస్6 ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ రుసుము అంశాలతోపాటు యువత ఎక్కువగా క్యాబ్, మెట్రో రైళ్లపై ఆధారపడుతుండటం కూడా ఆటోమొబైల్ రంగంలో మందగమనం ఏర్పడిందని అన్నారు. నిర్మలా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా నిర్మలా వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇదొక అవివేకమైన సిద్ధాంతం అని విమర్శించారు.