క్షణాల్లోనే కుండపోత వర్షం, నిమిషాల్లోనే జల ప్రళయం.. ఈ కుంభవృష్టికి కారణం ఏంటి?

ఇంతకీ క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి? ఉన్నట్లుండి కుంభవృష్టి కురవడానికి కారణమేంటి?

క్షణాల్లోనే కుండపోత వర్షం, నిమిషాల్లోనే జల ప్రళయం.. ఈ కుంభవృష్టికి కారణం ఏంటి?

Heavy Rains In India : మేఘం ఉరిమేస్తుంది. కారు మబ్బులు కమ్ముకొస్తాయి. నిమిషాల్లో వాతావరణం మారిపోయి కుండపోత ముంచేస్తోంది. చూస్తుండగానే కళ్ల ముందు వినాశనం జరిగిపోతోంది. ఎప్పుడూ వర్షాలే పడని ఎడారి దేశమైనా.. పర్వత ప్రాంతం వియత్నాం అయినా.. పచ్చని ప్రకృతి అందాలకు నిలయమైన వయనాడ్ అయినా.. మంచు కొండలకు కేరాఫ్ గా ఉండే హిమాచల్ ప్రదేశ్ అయినా.. జలప్రళయానికి హద్దే లేకుండా పోతోంది.

గంటల్లోనే ఏడాది కాలం కురిసేంత వర్షపాతం నమోదవుతోంది. మేఘాలు పగిలిపోయి ఆకాశమే కిందకు ఊడిపడిందా? అన్నట్లుగా వర్షాలు సృష్టించే విలయ తాండవం అంతా ఇంతా కాదు. ఉన్నట్లుండి కుంభవృష్టి కురవడానికి కారణం ఏంటో అంతుచిక్కడం లేదు. ఇక నుంచి వర్షం అంటే క్లౌడ్ బరస్టేనా?

Also Read : అయ్యో పాపం.. వయనాడ్ బాధితురాలు శ్రుతి జీవితంలో మరో అంతులేని విషాదం..

వాన, వరద.. వీటితో కొంతవరకే ఆనందం.. ఒక్కోసారి వాన సృష్టించే విలయం మాటల్లో చెప్పలేం. అందుకే, జల ప్రళయం వచ్చిందంటే చాలు క్లౌడ్ బరస్ట్ అని ఫిక్స్ అయిపోతున్నాం. ఆకాశం బద్దలైందా? అన్నట్లుగా వాన పడి ఒక ప్రాంతమే కొట్టుకుపోతోంది. దేశం ఏదైనా ఏ ఏరియా అయినా ఈ మధ్య క్లౌడ బరస్ట్ కామన్ అయిపోయింది. ఇంతకీ క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి? ఎందుకు ఉన్నట్లుండి కుండపోత వర్షం కురుస్తుంది?