Emmanuel Macron: నరేంద్ర మోదీకి థాంక్స్ చెప్పిన ఫ్రాన్స్ అధ్యక్షుడు.. ఎందుకో తెలుసా?

ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం, ఫ్రాన్స్ మధ్య సంబంధాలలో పురోగతి ఉంది. ఈ ఏడాది జూలైలో ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా బాస్టిల్ డే పరేడ్‌లో గౌరవ అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

Emmanuel Macron: నరేంద్ర మోదీకి థాంక్స్ చెప్పిన ఫ్రాన్స్ అధ్యక్షుడు.. ఎందుకో తెలుసా?

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా భారతదేశం నుంచి వచ్చిన ఆహ్వానానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. వాస్తవానికి ఈ రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ రావాల్సి ఉంది. ఆయనకు బదులుగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ప్రియ మిత్రమా నరేంద్రమోదీ
కాగా, ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఆరవ ఫ్రెంచ్ నాయకుడు మాక్రాన్ అవుతారు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తన అధికారిక ఎక్స్ ఖాతా పోస్ట్‌ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘మీ ఆహ్వానానికి ధన్యవాదాలు ని ప్రియ మిత్రమా నరేంద్రమోదీ. భారతీయులతో గణతంత్ర వేడుకల్ని జరుపుకునేందుకు నేను ఇండియాకి వస్తాను’’ అని పోస్ట్ చేశారు. ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం, ఫ్రాన్స్ మధ్య సంబంధాలలో పురోగతి ఉంది. ఈ ఏడాది జూలైలో ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా బాస్టిల్ డే పరేడ్‌లో గౌరవ అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

జో బిడెన్ ఎందుకు రావడం లేదు?
ముఖ్య అతిథిగా రావాలన్న భారత్ ఆహ్వానాన్ని బిడెన్ తిరస్కరించినట్లు సమాచారం. బిడెన్ తన బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ పని చేసినట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. ఆయన స్టేట్ ఆఫ్ యూనియన్‌లో ప్రసంగించాలని, వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధం కావాలనే పనిలో ఉన్నారట. ఇవే కాకుండా, ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధంపై వాషింగ్టన్ దృష్టి పెట్టింది. ఆ పనిలో కూడా ఆయన నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది.