Odd Even System: సరి-బేసి విధానం వల్ల ఇప్పటి వరకు జరిగిన ప్రయోజనం ఎంత? ఇదెందుకు అవసరం?
రోడ్లపైకి తక్కువ వాహనాలు రావడం వల్ల కార్బన్ ఉద్గారాలు కచ్చితంగా తగ్గుతాయని, ఇది కాలుష్యాన్ని కొద్దిగా తగ్గిస్తుందని కుండబద్దలు కొట్టి మరీ కొందరు చెప్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఈ నిబంధన అమలు చేయడం వెనుక ఉన్న లక్ష్యం కాలుష్యాన్ని తగ్గించడమే.

Delhi Air Polution: ఢిల్లీలో కాలుష్యం మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. అయితే దీనిని నివారించేందుక అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి సరి-బేసి నిబంధన అమలులోకి తీసుకువచ్చింది. ఈ నెల 13 నుంచి 20 వరకు ఈ నిబంధన అమలులో ఉంటుందని సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఈ నిబంధన ప్రకారం.. సరి రోజుల్లో సరి నంబరుతో ఉన్న వాహనాలు, బేసి రోజుల్లో బేసి నంబర్లతో ఉన్న వాహనాలు మాత్రమే రోడ్డు మీదకు రావాల్సి ఉంటుంది.
కాలుష్య నియంత్రణ కోసమే ఈ విధానం తీసుకొచ్చామని కేజ్రీవాల్ ప్రభుత్వం చెప్పినప్పటికీ దీనిపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. గతంలో ఈ నిబంధనను ఢిల్లీలో అమలు చేశారు. దాని వల్ల వాహనాల సంఖ్య సంఖ సగానికి తగ్గింది. ఇది కాలుష్యానికి కొంత ఉపయోగపడిందనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. అయితే అది చాలా కొద్ది మొత్తంలోననే అన్నారు. ఇక దీని వల్ల ఏమాత్రం మార్పు రాలేదని మరికొందరు చెప్పారు.
ఇది కూడా చదవండి: Israel Palestine Conflict: గాజా రెండు ముక్కలైందంటూ సంచలన ప్రకటన చేసిన ఇజ్రాయెల్
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు రోడ్లపై వాహనాల సంఖ్య సగానికి తగ్గనుంది. దీని వల్ల ఇంధన వినియోగం తగ్గుతుందని, వాతావరణ కాలుష్యం తగ్గుతుందని కొంత మంది నిపుణులు చెబుతున్నారు. ఈ నిబంధన అమలులో ఉన్న సమయంలో ఎక్కువ మంది ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగిస్తారు. ఇలా ప్రజా రవాణాకు కూడా ఆదాయం పెరుగుతుందని అంటున్నారు. ట్రాఫిక్ జామ్‌ల సమస్య నుంచి కూడా విముక్తి లభిస్తుందట. ఇంతకుముందు కూడా బేసి-సరి అమలు చేశారు. అప్పుడు నిర్వహించిన కొన్ని సర్వేల్లో సరి-బేసి నిబంధన వల్ల వాయు కాలుష్యం కొంతమేర తగ్గుతుందని చెప్పారు.
రోడ్లపైకి తక్కువ వాహనాలు రావడం వల్ల కార్బన్ ఉద్గారాలు కచ్చితంగా తగ్గుతాయని, ఇది కాలుష్యాన్ని కొద్దిగా తగ్గిస్తుందని కుండబద్దలు కొట్టి మరీ కొందరు చెప్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఈ నిబంధన అమలు చేయడం వెనుక ఉన్న లక్ష్యం కాలుష్యాన్ని తగ్గించడమే. అయితే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇది శాశ్వత పరిష్కారం కాదని కొందరు అంటుంటే.. అసలు దీని వల్ల ప్రయోజనం ఏమీ లేదని మరి కొందరు అంటున్నారు. ఈ పథకం పని తీరుపై అప్పట్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ప్రశ్నలు లేవనెత్తింది. సరి-బేసి పథకం పెద్దగా విజయం సాధించలేదని, గాలి నాణ్యతలో కూడా పెద్దగా మార్పు రాలేదని చెప్పింది. అయితే దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేవని చెప్పడం కూడా కష్టమే.
ఇది కూడా చదవండి: KA Paul : రాహుల్ గాంధీ నాకు కాల్ చేసి మద్దతు అడిగారు.. ఇవ్వనని చెప్పాను : కేఏ పాల్