KA Paul : రాహుల్ గాంధీ నాకు కాల్ చేసి మద్దతు అడిగారు.. ఇవ్వనని చెప్పాను : కేఏ పాల్

కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేసీఆర్ కు ఓటు వేసినట్టేనని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ పేర్కొన్నారు. తెలంగాణలో పోటీ చేయాలా లేదా అనేది అక్టోబర్ 10వ తేదీన నిర్ణయించి చెబుతానని తెలిపారు.

KA Paul : రాహుల్ గాంధీ నాకు కాల్ చేసి మద్దతు అడిగారు.. ఇవ్వనని చెప్పాను : కేఏ పాల్

Praja Shanti Party President KA Paul

KA Paul Key Comments : కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేసీఆర్ కు ఓటు వేసినట్టేనని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ పేర్కొన్నారు. తెలంగాణలో పోటీ చేయాలా లేదా అనేది అక్టోబర్ 10వ తేదీన నిర్ణయించి చెబుతానని తెలిపారు. కేసీఆర్ తమపై అక్రమ కేసులు పెట్టి పోలీసులతో భయందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డిలో తాను పోటీ చేస్తానని చెప్పిన వెంటనే రైతు కుటుంబాలను చిత్ర హింసలకు గురి చేశారని పేర్కొన్నారు. తాను పవన్ కళ్యాణ్, షర్మిల లాగా ప్యాకెజ్ స్టార్ ను కాదని స్పష్టం చేశారు.

రానున్న ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నామని పేర్కొన్నారు. విశాఖపట్నం నుండి తాను ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. 12 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేశామని తెలిపారు. . అన్ని కులాలకు తమ పార్టీలో ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. 344 మంది టికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రేపు తమ పార్టీ రెండవ జాబితా విడుదల చేస్తామని చెప్పారు.

Bandi Sanjay : నేను, రాజాసింగ్ ధర్మం కోసం చావడానికైనా సిద్ధం : బండి సంజయ్

రాహుల్ గాంధీ తనకు కాల్ చేసి మద్దతు అడిగారని, తాను ఇవ్వనని చెప్పానని వెల్లడించారు. రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలని తనకు చాలా మంది కాల్స్ చేస్తున్నారని తెలిపారు. అమెరికా నుండి కూడా తనకు కాల్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. బండ్ల గణేష్ సైతం తనకు కాల్ చేశాడని తెలిపారు. కొన్ని బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని పేర్కొన్నారు. కేఏ పాల్ ను కొనేవాడు భూమిద ఎవ్వడు పుట్టలేదన్నారు.

తన 12 అకౌంట్స్ సీజ్ చేశారని తెలిపారు. తనకు ఎక్కడ కూడా ఆస్తులు లేవన్నారు. తనను ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణను అమెరికా చేస్తానని చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయితే ఉచితంగా విద్యా, వైద్యం అందిస్తానని హామీ ఇచ్చారు. తమకు ఒక్క అవకాశం ఇవ్వండని కోరారు. 30 సీట్లు గెలిస్తే తాను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు.