Bandi Sanjay : నేను, రాజాసింగ్ ధర్మం కోసం చావడానికైనా సిద్ధం : బండి సంజయ్
హిందువుల ఓట్లను బీజేపీ ఓటు బ్యాంక్ గా మార్చడంలో సఫలమయ్యామని పేర్కొన్నారు.పాతబస్తీని డెవలప్ మెంట్ చేస్తామని సవాల్ చేశానని తెలిపారు. కరీంనగర్ లో కాషాయం జెండాకే స్థానం ఉందన్నారు.

BJP Leader Bandi Sanjay
BJP Leader Bandi Sanjay : బీజేపీ నేత బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను, రాజాసింగ్ ధర్మం కోసం పని చేస్తున్నామని, దర్మం కోసం చావడానికి సిద్ధమని అన్నారు. కాషాయం జెండా కోసం పని చేసే నాయకులమని పేర్కొన్నారు. కాషాయ జెండాని తెలంగాణ అంతటా రెపరెపలాడించామని తెలిపారు. 24 రోజులు పూర్తి స్థాయిలో తనకు సహకారం అందించాలని కోరారు. ఈ మేరకు ఆయన కరీంనగర్ జిల్లాలో మీడియాతో మాట్లాడారు.
హిందువుల ఓట్లను బీజేపీ ఓటు బ్యాంక్ గా మార్చడంలో సఫలమయ్యామని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ కేసులు పెట్టి తనను జైలుకు పంపారని మండిపడ్డారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థుల కోసం కొట్లాడితే తనపై ముప్పై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీని డెవలప్ మెంట్ చేస్తామని సవాల్ చేశానని తెలిపారు. కరీంనగర్ లో కాషాయం జెండాకే స్థానం ఉందన్నారు.
స్మార్ట్ సిటీ నిధులు, నేషనల్ హైవే నిధులు తానే తీసుకొచ్చానని తెలిపారు. గ్రామ పంచాయతీకి నిధులు కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇస్తుందన్నారు. బీజేపీ సహకారం లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మీటింగ్ కు ప్రజలు ఎవరు రావడం లేదని విమర్శించారు. కాళేశ్వరం రిపోర్టు కరెక్ట్ కాదా? కాళేశ్వరం పిల్లర్లకి పగుళ్లు వచ్చింది నిజం కాదా అని నిలదీశారు.
కరీంనగర్ ఎన్నికల ఫలితాల కొసం యావత్ తెలంగాణ ఎదురు చూస్తుందన్నారు. ప్రజల కోసం కొట్లాడిన వారిని అసెంబ్లీకి పంపాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఉన్న ఒక్కరికైనా రేషన్ కార్డు ఇప్పించారా అని నిలదీశారు. గంగుల కమలాకర్ బాధితుల సంఘం ఏర్పాటు చేసే పరిస్థితి కరీంనగర్ లో ఉందని ఎద్దేవా చేశారు.
YS Sharmila: బీజేపీకి సవాల్ చేస్తున్న.. మీరు నిజాయితీ పరులైతే వాటిపై సీబీఐ విచారణకు ఆదేశించండి
గంగుల కమలాకర్, అతని అనుచరులు భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ అని ఆరోపించారు. ప్రతి ఇంటి నుండి ఛత్రపతి శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయిలు రాావాలని పిలుపునిచ్చారు. మన ఓటు బ్యాంకు దమ్ము ఏంటో చూపించాలన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే వచ్చే మేయర్ ఎంఐఎంకి ఇవ్వాలని ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు.