BJP Star Campaigners List Telangana 2023: 40 మందితో బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ జాబితా విడుదల.. విజయశాంతికి దక్కని చోటు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ 40 మందితో స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో విజయశాంతికి చోటు దక్కలేదు.

BJP Star Campaigners List Telangana 2023: 40 మందితో బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ జాబితా విడుదల.. విజయశాంతికి దక్కని చోటు

Telangana BJP

Updated On : November 6, 2023 / 2:07 PM IST

Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ 40 మందితో స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను విడుదల చేసింది. బీజేపీ తరపున ప్రచారంచేసే జాబితాను ఎన్నికల కమిషన్ కు కమలనాథులు అందించారు. వీరిలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల బీజేపీ సీఎంలు, తెలంగాణ నాయకులు ఉన్నారు. ఈ జాబితాలో బీజేపీ మహిళానేత విజయశాంతికి చోటు దక్కలేదు. గత కొంతకాలంగా విజయశాంతి పార్టీ తీరుపట్ల అసంతృప్తితో ఉండటంతోపాటు, ఆమె బీజేపీని వీడుతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమెకు ఈ జాబితాలో పార్టీ అధిష్టానం చోటు కల్పించలేదని తెలుస్తోంది.

 

బీజేపీ స్టార్ క్యాంపెయినర్ జాబితా ఇదే..

పీఎం నరేంద్ర మోదీ
జేపీ నడ్డా
రాజ్ నాథ్ సింగ్
అమిత్ షా
నితిన్ గడ్కరీ
బీఎస్ యడ్యూరప్ప
డాక్టర్ కె. లక్ష్మణ్
యోగి ఆధిత్యనాథ్
పియూష్ గోయాల్
నిర్మలా సీతారామన్
స్మృతి జుబిన్ ఇరానీ,
పురుసోత్తమ్ రూపాల
అర్జున్ ముడా
భూపేంద్ర యాదవ్
జి. కిషన్ రెడ్డి
సాధ్వీ నిరంజన్ జ్యోతి.
ఎల్. మురుగన్
ప్రకాశ్ జయదేకర్
తరుణ్ చుగ్
సునీల్ బన్సాల్
బండి సంజయ్ కుమార్
అరవింద్ మేనన్
డీ.కె. అరుణ
పి. మురళీధర్ రావు
దగ్గుబాటి పురందేశ్వరి
రవి కిషన్
పొంగులేటి సుధాకర్ రెడ్డి
జితేందర్ రెడ్డి
గరికపాటి మోహన్ రావు
ఈటల రాజేందర్
ధర్మపురి అరవింద్
సోయం బాపూరావు
టి. రాజాసింగ్
కొండా విశ్వేశ్వరరెడ్డి
బూర నర్సయ్యగౌడ్
జి. ప్రేమేందర్ రెడ్డి
దుగ్యాల ప్రదీప్ కుమార్
బంగారు శృతి
కాసం వెంకటేశ్వర్లు యాదవ్
టి. క్రిష్ణ ప్రసాద్