M. Venkaiah Naidu : ఆర్ధిక సహాయం కోరిన ఉపరాష్ట్రపతి ?

9439073183 అనే నెంబరుగల వ్యక్తి తాను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడ్ని అని పరిచయం చేసుకుంటూ   ఆర్ధిక సహాయం కావాలంటూ పలువురుకి వాట్సప్ మెసేజ్ లు చేశాడు.

M. Venkaiah Naidu : ఆర్ధిక సహాయం కోరిన ఉపరాష్ట్రపతి ?

Venkaih Naidu

Updated On : April 24, 2022 / 7:35 AM IST

M. Venkaiah Naidu :  ఉపరాష్ట్ర పతి ఏమిటా ఆర్ధిక  సహాయం కోరటం ఏమిటా అనుకుంటున్నారా….. అవును సైబర్   నేరగాళ్లు ఉప రాష్ట్రపతిని వదలలేదు.  ఫేస్ బుక్, వాట్సప్ ల ద్వారా నకిలీ ఎకౌంట్లు క్రియేట్ చేసి డబ్బులు సహాయం చేయాలని కోరే సోషల్ మీడియా మోసగాళ్లు ఉపరాష్ట్రపతి  వెంకయ్య నాయుడు పేరును ఉపయోగించి మోసం చేయటానికి ప్రయత్నించారు. చివరకు ఇది ఆయన దృష్టికి వెళ్ళటంతో వెంకయ్య నాయుడు హోం శాఖకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే   9439073183 అనే నెంబరుగల వ్యక్తి తాను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడ్ని అని పరిచయం చేసుకుంటూ   ఆర్ధిక సహాయం కావాలంటూ పలువురుకి వాట్సప్ మెసేజ్ లు చేశాడు.

ఈ విషయం ఉపరాష్ట్రపతికి తెలిసింది. వెంటనే ఆయన తన కార్యాలయం ద్వారా కేంద్ర హోం శాఖను అప్రమత్తం చేశారు. ఇటువంటి సందేశాలు మరిన్ని నెంబర్లు నుంచి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.