Parvesh Sahib Singh Verma : ఎవరీ పర్వేష్ వర్మ? కేజ్రీవాల్‌ను ఢిల్లీలో మట్టికరిపించిన బీజేపీ నేత..!

Delhi Election Results : కేజ్రీవాల్ కంచుకోట బద్దలైంది. ఆప్ భవిష్యత్తు అంధకారంగా మారింది.. ఆమ్ ఆద్మీ పార్టీ కేడర్ అయోమయంలో పడింది. అధినేత కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిత్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు.

Parvesh Sahib Singh Verma : ఎవరీ పర్వేష్ వర్మ? కేజ్రీవాల్‌ను ఢిల్లీలో మట్టికరిపించిన బీజేపీ నేత..!

Who is Parvesh Sahib Singh Verma

Updated On : February 8, 2025 / 2:51 PM IST

Parvesh Sahib Singh Verma : ఆప్‌కు కోలుకోలేని దెబ్బపడింది. భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటమిపాలయ్యారు. కేజ్రీవాల్ ఓటమితో ఆప్ కేడర్ ఒక్కసారిగా షాకయింది. ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్‌తో జరిగిన హోరాహోరీ పోరులో బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు.

ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ప్రకారం.. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మకు 25,057 ఓట్లు వచ్చాయి. అరవింద్ కేజ్రీవాల్‌కు 22,057 ఓట్లు పోలయ్యాయి. కేజ్రీవాల్ పై పర్వేశ్ వర్మ 3వే ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 11 రౌండ్ల లెక్కింపు తర్వాత కేజ్రీవాల్ ఓట్ల సంఖ్య 20,190 కాగా, వర్మకు 22,034 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్‌కు 3873 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ప్రతి రౌండ్ కౌంటింగ్‌తో ఆధిక్యం, వెనుకబడిన సంఖ్యలు మారుతూ ఉండగా.. కేజ్రీవాల్, వర్మ మధ్య గట్టి పోటీనే జరిగింది. అరవింద్ కేజ్రీవాల్‌పై పర్వేశ్ వర్మ గెలిచారని ట్రెండ్స్ ఇప్పుడు సూచిస్తున్నాయి. ఇప్పుడంతా కేజ్రీవాల్‌ కంచుకోట బద్దలు కొట్టిన పర్వేశ్ వర్మ గురించే చర్చించుకుంటున్నారు.

Read Also : Delhi Results 2025 : కేజ్రీవాల్‌కి ముందే చెప్పా.. అయినా పట్టించుకోలేదు.. లిక్కర్ పాలసీపైనే ఫోకస్ పెట్టాడు.. అన్నా హజారే కామెంట్స్..!

పర్వేశ్ వర్మ ఎవరు?
ఇంతకీ, ఎవరీ పర్వేశ్ వర్మ అంటే.. ఢిల్లీ రాజకీయ కుటుంబానికి చెందిన అనుభవజ్ఞుడైన మాజీ బీజేపీ నేత, మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే ఈ పర్వేశ్ వర్మ.. కాలుష్య నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా ఆప్ ప్రభుత్వ అసమర్థతలను విమర్శించారు. అంతేకాదు.. ఆయన మామ ఆజాద్ సింగ్ ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కూడా పనిచేశారు.

2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ టికెట్‌పై ముండ్కా నియోజకవర్గం నుంచి వర్మ పోటీ చేశారు. 1977లో జన్మించిన పర్వేశ్ వర్మ.. ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్శిటీలోని కిరోరి మాల్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు.

ఆ తరువాత, ఆయన ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చదివారు. 2013లో మెహ్రౌలీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఢిల్లీ శాసనసభలో విజయం సాధించడంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

2014లో పశ్చిమ ఢిల్లీ పార్లమెంటరీ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా ఆయన మరింత విజయాన్ని సాధించారు. ఆ తర్వాత 2019లో 5.78 లక్షల ఓట్లతో ఘన విజయం సాధించారు. ఎంపీగా తన పదవీకాలంలో, పార్లమెంటు సభ్యుల జీతాలు, భత్యాలపై జాయింట్ కమిటీ సభ్యుడిగా, పట్టణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు.

Read Also : Delhi Election Results : ఆప్‌కు బిగ్ షాక్.. అరవింద్ కేజ్రీవాల్ ఓటమి.. బీజేపీ పర్వేష్ వర్మ చేతిలో పరాజయం

2025 ఢిల్లీ ఎన్నికలకు ముందు, పర్వేష్ వర్మ “రిమూవ్ కేజ్రీవాల్, సేవ్ ది నేషన్” అనే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ప్రస్తుత ఆప్ పరిపాలన వారి ప్రాథమిక హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. తన ప్రచారంలో భాగంగా వర్మ ఢిల్లీ ప్రభుత్వ పరిపాలనా పనితీరును తీవ్రంగా ఖండించారు.

ముఖ్యంగా కాలుష్య సమస్యలను నిర్వహించడం, మహిళలకు భద్రత, పౌర మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి పోరాడారు. నగరానికి ముఖ్యమైన పర్యావరణ సవాలుగా మిగిలిపోయిన యమునా నదిని శుద్ధి చేయడంలో ఆప్ అసమర్థతను ఆయన ప్రత్యేకంగా ఎత్తి చూపారు.