PM Face for INDIA bloc: ఖర్గే, మమత, కేజ్రీవాల్, నితీశ్.. ఇందులో ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై సర్వేలో ఏం తేలిందంటే?

ఇండియా కూటమికి కన్వీనర్‌గా చూడాలంటూ ఎక్కువ మంది ఓటు వేశారు. ఏకంగా 44 శాతం మంది ఖర్గేను ఇండియా కూటమి కన్వీనర్ చేయాలని అన్నారు. అయితే 34 శాతం మంది మాత్రం ఆయన కూటమికి కన్వీనర్ గా ఒద్దని చెప్పారు.

PM Face for INDIA bloc: ఖర్గే, మమత, కేజ్రీవాల్, నితీశ్.. ఇందులో ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై సర్వేలో ఏం తేలిందంటే?

Updated On : December 21, 2023 / 7:45 PM IST

వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీపై వ్యతిరేకతతో ప్రధాని పీఠం ఎవరిని వరిస్తుందనేది దానిపై చర్చ ఊపందుకుంది. కాగా, మంగళవారం (డిసెంబర్ 19) ఢిల్లీలో విపక్షాల కూటమి ‘ఇండియా’ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరు ప్రధానమంత్రి పదవికి ప్రస్తావనకు వచ్చింది. అయితే ఆయన దానిని తిరస్కరించారు.

ఖర్గేను ప్రధానమంత్రి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. అయితే దీనిపై ఖర్గే స్పందిస్తూ.. ముందుగా ఎన్నికల్లో గెలవాలని, మిగతావి తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరైతే బాగుటుందనే దానిపై సీ-వోటర్ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో షాకింగ్ గణాంకాలు వెలువడ్డాయి.

ఇది కూడా చదవండి: ఎన్నికలు వచ్చేస్తున్నాయ్.. అధికారుల బదిలీలపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

సర్వేలో, ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు ఉండాలనే ప్రశ్నపై అత్యధికంగా 27 శాతం మంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చారు. ఇక 14 శాతం మంది కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అయితే బాగుంటుందని చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు 12 శాతం మంది, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు 10 శాతం మంది మద్దతు నిలిచారు. ఇక 8 శాతం మంది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేరును, 5 శాతం మంది ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును తీసుకున్నారు. అదే సమయంలో 24 శాతం మంది ‘తెలియదు’ అని సమాధానం ఇచ్చారు.

I.N.D.I.A. నుంచి ప్రధానమంత్రి ఎవరు కావాలి?
రాహుల్ గాంధీ – 27 శాతం
మల్లికార్జున్ ఖర్గే – 14 శాతం
అరవింద్ కేజ్రీవాల్ – 12 శాతం
నితీష్ కుమార్ – 10 శాతం
మమతా బెనర్జీ – 8 శాతం
శరద్ పవార్ – 5 శాతం
తెలియదు – 24 శాతం

అయితే మల్లికార్జున్ ఖర్గేను ప్రధానిగా తక్కువ మందే కోరుకున్నప్పటికీ.. ఆయనను ఇండియా కూటమికి కన్వీనర్‌గా చూడాలంటూ ఎక్కువ మంది ఓటు వేశారు. ఏకంగా 44 శాతం మంది ఖర్గేను ఇండియా కూటమి కన్వీనర్ చేయాలని అన్నారు. అయితే 34 శాతం మంది మాత్రం ఆయన కూటమికి కన్వీనర్ గా ఒద్దని చెప్పారు. అదే సమయంలో 22 శాతం మంది తెలియదని సమాధానం ఇచ్చారు.

ఇది కూడా చదవండి: గాజాను ధ్వంసం చేస్తున్న ఇజ్రాయెల్‌కు హమాస్ చెరలో ఉన్న తన బందీలను విడిపించడం ఎందుకు అంత పెద్ద సవాలుగా మారింది?