చిన్మయానంద్‌ను అధికారంతో కాపాడుకొస్తున్నారు: ప్రియాంక గాంధీ

చిన్మయానంద్‌ను అధికారంతో కాపాడుకొస్తున్నారు: ప్రియాంక గాంధీ

Updated On : September 29, 2019 / 8:36 AM IST

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆదివారం బీజేపీ నేత చిన్మయానంద్ కేసుపై విమర్శలు గుప్పించారు. కేవలం అడ్మినిస్ట్రేషన్ అనుకూలంగా ఉండడం వల్లనే కేంద్ర మాజీ మంత్రిపై అత్యాచార కేసు నమోదు చేయడం లేదు. షాజన్‌పూర్‌కు చెందిన పీజీ విద్యార్థిని చిన్మయానంద్‌పై రేప్ ఆరోపణలు గుప్పించింది.

ట్విట్టర్ వేదికగా ప్రియాంక గాంధీ ఓ పోస్టు పెట్టారు. ‘సంవత్సరం క్రితం షాజన్‌పూర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులంతా చిన్మయానంద్‌కు హారతులు ఇచ్చేవారు. ఈ విషయం అన్ని న్యూస్ పేపర్లలో వచ్చింది. బాధితురాలు ఆరోపణలు చేస్తుంటే కేసు ఎందుకు నమోదుకాలేదు. అడ్మినిస్ట్రేషన్ అంతా సపోర్ట్ చేస్తుంటే కేసు ఎలా పెడతారు’ అని ప్రియాంక ప్రశ్నించారు. 

లా స్టూడెంట్‌ను బుధవారం పోలీసులు ఎక్స్‌టార్షన్ కింద 14రోజులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది గంటల తర్వాత ఆమె తరపున పెట్టిన బెయిల్ కూడా రిజెక్ట్ అయింది. అతనిపై సెక్షన్ 376సీ కింద కేసులు నమోదు అయ్యాయి.