లిక్కర్ షాపులు ఓపెన్ చేయడానికి రాష్ట్రాలకెందుకీ ఆరాటం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కేరళ ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సాయాన్ని ప్రకటించకుండా పొగడ్తలు మాత్రమే కురిపించిందని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజక్ విమర్శించారు. దాదాపు రాష్ట్రాలన్నీ రూ.500 నుంచి రూ.1000కోట్లు అప్పులు అడిగి శాలరీల్లో కోత విధిస్తున్నాయి. ఇదిలా ఉంటే వారంతా మిగిలిన డెవలప్‌మెంట్ పనులపై ఫోకస్ పెడుతున్నారు. బ్యాంకులకు వెళ్లి అప్పులు అడుగుతుంటే 9శాతం వడ్డీని విధిస్తున్నారు.
పోయిన వారం కేరళ 15ఏళ్లకు రూ.6వేల కోట్లు అప్పు అడగటానికి వెళ్తే 8.96శాతం వడ్డీ రేటు అని చెప్పారు. ఇది ఇంటిలోన్ కోసం తీసుకునే రూ.60లక్షల అప్పు కంటే చాలా ఎక్కువ. కానీ, లిక్కర్ విషయానికి వస్తే ఆల్కహాల్ అమ్మకంతో వచ్చే ట్యాక్స్ ల రెవెన్యూ రాష్ట్రాల త్రైమాసికి ఆధాయంతో సమానం. మహమ్మారి కారణంగా రాష్ట్రాలపై ఆర్థిక భారాన్ని పెంచడమే కాక జీఎస్టీ వసూళ్లు సైతం తగ్గిపోయేలా చేసింది.
ఫలితంగా ఆధాయం పూర్తిగా పడిపోయింది. ఆధాయ వనరులేవీ కనిపించకపోవడంతో లిక్కర్ సేల్స్ మీదే రాష్ట్రాల కన్ను పడింది. దానికి పెద్ద కారణం ఆధాయాన్ని కూడగట్టుకోవడమే. ప్రతి ఏటా లిక్కర్ అమ్మకాలపై ఢిల్లీ ప్రభుత్వం రూ.5వేల కోట్లు సంపాదించుకుంటుంది. అంటే నెల రోజుల పాటు మద్యం షాపులు మూసివేయడంతో రూ.500కోట్లు నష్టపోయినట్లే. కర్ణాటకలో లిక్కర్ సేల్స్ 2019-20 సంవత్సరానికి 21వేల 400కోట్ల రూపాయలు. మరికొన్ని రాష్ట్రాల్లో లిక్కర్ ద్వారా వచ్చే ట్యాక్స్ రెవెన్యూ రెండు లేదా మూడో స్థానంలో ఉంటుంది.
ఆదాయం కూడగట్టుకునే పనిలో భాగంగా అస్సాం, మేఘాలయ, ఢిల్లీలో లిక్కర్ షాపులు ఓపెన్ చేసేశాయి. పశ్చిమ బెంగాల్, కర్ణాటక కూడా తెరవాలని ఆలోచన చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, గోవాలు ఈ వారం తర్వాత నుంచి అమ్ముకోవచ్చని పర్మిషన్ ఇచ్చేసింది. పశ్చిమ బెంగాల్ హోల్ సేల్ అమ్మకాలను ఆపేయాలని నిర్ణయించి గతవారమే మళ్లీ ఓపెన్ చేసింది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం 2006 ప్రకారం.. ఆల్కహాల్ లిక్విడ్లు కూడా ఆహారం కిందకే వస్తాయి. లాక్ డౌన్ విషయంలో వీటిని మినహాయించొచ్చు. దీంతో కొన్ని రిపోర్టులు ఇలా లిక్కర్ షాపులు ఓపెన్ చేయడానికి కేంద్రం అనుమతి అవసరం లేదని చెప్తున్నాయి. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు కొద్ది గంటలు కండిషన్ తో, కొద్ది రోజులు మాత్రమే అమ్మకాలు జరుపుతున్నాయి. పశ్చిమబెంగాల్ లో హోం డెలివరీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.