Rich Indians: ఇండియాకు గుడ్ బై చెబుతున్న కుబేరులు.. ఇబ్బంది లేదంటున్న ఆర్థిక నిపుణులు.. ఎందుకంటే?

భారత్ నుంచి సంపన్నులు వెళ్లిపోతున్న మాత్రాన ఇప్పటికిప్పుడు దేశానికి వచ్చిన నష్టమేమి లేదంటున్నారు నిపుణులు. వ్యాపారులు వెళ్లినంత మాత్రానా ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టమేని లేదని ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం.

Rich Indians: ఇండియాకు గుడ్ బై చెబుతున్న కుబేరులు.. ఇబ్బంది లేదంటున్న ఆర్థిక నిపుణులు.. ఎందుకంటే?

Rich Indians Leaving The Country

Rich Indians Leaving The Country : భారీగా కోటీశ్వరులు భారత్‌ను వీడుతున్నప్పటికీ ఒక అంశం మాత్రం ఊరట కలిగిస్తోంది. ఎంతమంది అయితే భారత్ నుంచి వెళ్తున్నారో అంతకంటే ఎక్కువ మంది మిలియనీర్లు (Indian Millionaires) కొత్తగా దేశంలోనే తయారవుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ నుంచి ఎంతమంది కోటీశ్వరులు (Rich People) వలసలు పోతున్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నమాట. భారత్, చైనా (China)ల నుంచి వెళ్లిపోతున్న మిలియనీర్ల కంటే కొత్తగా ఈ దేశాల్లో పుట్టుకొస్తున్న మిలియనీర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది.

అమెరికా (America), చైనా తర్వాత అత్యధిక మిలియనీర్లు ఉన్నది భారత్‌లోనే. 6 వేల 5వందల కోట్లు అంతకంటే ఎక్కువ సంపద ఉన్న మిలియనీర్లు భారత్‌లో 119 మంది ఉన్నారని లెక్క. దీని ప్రకారం మిలియనీర్ల జాబితాలో భారత్ మూడోస్థానంలో ఉంది. ఇక సంపన్న దేశాల్లో భారత్‌కు 6వ స్థానం లభించింది. ఏడాది క్రితం వరకు సంపదలో సగానికన్నా తక్కువే ఉన్న వారు.. 2023 నాటికి బిలియనీర్ల జాబితాలోకి వచ్చేశారు. దీంతో భారత్‌లో మిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్ల లిస్ట్ 2023 ప్రకారం ప్రపంచంలో భారత్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

భారత్‌లో మిలియనీర్లు అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani), అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani), ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) వంటి పేర్లు ఉంటాయి. కానీ, దేశంలో ఇటీవలి కాలంలో మిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మిలియనీర్లు ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఫోర్బ్ వరల్డ్ బిలియనీర్ లిస్ట్ 2023 ప్రకారం భారత్‌లో 169 మంది మిలియనీర్లు ఉన్నారు. దేశంలోని మొత్తం మిలియనీర్ల దగ్గర ఉన్న సంపద.. భారత కరెన్సీలో చూసుకుంటే దాదాపు 55లక్షల కోట్లుగా ఉండొచ్చు. ఆల్రెడీ ఇప్పటికే సంపన్నులుగా ఉన్నవారు దేశాన్ని వదిలివెళ్లి పోతుంటే.. కోటీశ్వరులుగా ఎదుగుతున్న వాళ్ల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.

సంపన్నులు వలసవెళ్లడం అనేక రకాల చర్చలకు దారితీస్తోంది. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు మిలియనీర్లకు అనుకూలంగా లేవనే ప్రచారం ఉంది. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు మిలియనీర్లకు ఇబ్బందికరంగా మారాయి. డిమానిటైజేషన్ తర్వాత ప్రతీ ట్రాన్సాక్షన్ లెక్కలను చూపాల్సి వచ్చింది. పన్నుల నిబంధనలు కఠినంగా ఉన్నాయి. బ్యాంకు లావాదేవీలపై ఆంక్షలు ఉన్నాయి. లేకపోతే దర్యాప్తు సంస్థల నుంచి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంతకాదన్న భారత్‌లో ప్రతీపదేళ్లకోసారి కేంద్రంలో ప్రభుత్వం మారుతోంది. దాంతో పాటు రాష్ట్రాల్లో బిజినెస్ ఉంటే ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. పైగా ఒక్కో రాష్ట్రం ఒక్కో బిజినెస్ పాలసీని ఫాలో అవుతుంది. ఇండియాలో కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలపై కొన్ని రూల్స్ ఉన్నాయి. అన్నింటికి మించి భారత్ ప్రజాస్వామ్య దేశం. కార్మిక, కర్షకుల ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

Also Read: భారత ఆర్మీ కోసం.. మహీంద్ర వాహనాలు.. మొట్టమొదటిసారి డెలివరీ

ఇప్పటివరకు మనదేశంలో ఎదిగి సంపన్నులు అయినవారికి ప్రపంచదేశాల్లో డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి. ఏ ఇబ్బందులు లేని ప్రాంతాల్లో వ్యాపారాలను నెలకొల్పుకుని.. ఏ ఒత్తిడిలేకుండా విదేశాల్లో స్థిరపడాలన్నది మిలియనీర్ల ఆలోచన. అదే ఇప్పుడు సంపన్నుల ఇతర దేశాలకు వలస వెళ్లడానికి కారణమవుతుంది. ఎంత ధనికుడైనా, పేదోడైనా సంపాదించిన మొత్తం తనకే సొంతం కావాలనే కోరుకుంటాడు. కానీ ట్యాక్సుల రూపేనా, ఇతర అనుమతులు, వేతనాల రూల్స్ అమలు చేస్తే వచ్చే లాభం అక్కడికక్కడికే సరిపోతుందనే భావన ఉంది. సింగపూర్ లో అయితే ట్యాక్స్ తక్కువ. వేతనాలు కూడా మనదేశంతో పోలీస్తే కాస్త తక్కువనే ప్రచారం ఉంది. ఇండియాలో బిజినెస్ తో పోల్చుకుంటే విదేశాల్లోనే వ్యాపారాలు లాభసాటిగా ఉంటున్నాయనేది మిలియనీర్ల ఆలోచన. పైగా కొత్తరకం బిజినెస్‌లు చేసి.. వివిధ రంగాల్లో రాణించడానికి అడ్వాన్స్‌డ్ కంట్రీస్‌లోనే ఎక్కువ అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు సంపన్నులు.

Also Read: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు చెక్.. స్మార్ట్ సిగ్నల్స్ వచ్చేస్తున్నాయ్.. ఎలా పనిచేస్తాయో తెలుసా?

భారత్‌లో పన్ను చెల్లింపులకు సంబంధించి కఠిన నిబంధనలు ఉండటం సహా పలు సమస్యలతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి.. కోటీశ్వరులు వలస వెళ్లడానికి కారణమంటున్నారు ఎక్స్ పర్ట్స్. స్వదేశాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడితే దూరమైన సంపన్నులు తిరిగి వస్తారన్న అంచనా కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే వివిధ దేశాల నుంచి ఆస్ట్రేలియాకు అత్యధికంగా మిలియనీర్లు వలసపోతున్నారు. గతేడాది 10వేల మంది సంపన్నులు ఆయా దేశాల నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లి స్థిరపడినట్లు తేలింది. అంతకుముందు అమెరికాకే ఎక్కువగా వలసలుండేవి. 2015 నుంచి ఈ పరిస్థితి మారింది. ఎనిమిదేళ్లుగా ఆస్ట్రేలియాలో సెటిల్ అవుతున్న సంపన్నుల సంఖ్య పెరుగుతోంది.

Also Read: వివాహేతర సంబంధాలు, విడాకులపై నిషేధాస్త్రం.. చైనా కార్పొరేట్ కంపెనీ వినూత్న నిబంధన

భారత్ నుంచి సంపన్నులు వెళ్లిపోతున్న మాత్రాన ఇప్పటికిప్పుడు దేశానికి వచ్చిన నష్టమేమి లేదంటున్నారు నిపుణులు. కొత్తగా మిలియనీర్లు పుట్టుకొస్తుండటం, వ్యాపార అవకాశాలు పెరగడంతో.. పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయనే చెప్పొచ్చు. ఇప్పటికే ఉన్న వ్యాపారులు వెళ్లినంత మాత్రానా ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టమేని లేదని ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం. కొత్తగా మిలియనీర్లు ఎదుగుతుండటంతో..కొత్తరకం బిజినెస్ ఆలోచనలతో ఉద్యోగ అవకాశాలు పెరగడమే తప్ప తగ్గడం ఉండదంటున్నారు. ఈ తరం యువత ఎక్కువ ఎదగడానికి, ఇన్నోవేటివ్ ఐడియాస్ తో బిజినెస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సంపన్నులు వెళ్తే దేశానికేదో నష్టం జరుగుతుందన్న ప్రచారాన్ని ప్రస్తుతానికి కొట్టిపారేస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఏ రంగంలో అయినా ఎప్పుడూ కొత్తతరం వస్తూనే ఉంటుందనే.. సంపన్నులు విదేశాల్లో సెటిల్ అవడం స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఉందంటున్నారు. కొత్తతరం మిలియనీర్ల రాకతో దేశం మరింత అభివృద్ధి చెందే ఛాన్సే ఎక్కువగా ఉంది.

సొంత దేశంలో కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.. వివరాలకు ఈ వీడియో చూడండి..