లాబ్రడార్ల స్థానంలో బెల్జియన్ మాలినోయిస్ జాగిలాలు.. వాడనున్న NSG.. ప్రత్యేకతలేంటో తెలుసా?

NSG: కుక్కకు కెమెరా పెట్టి రిమోట్ డెలివరీ సిస్టమ్స్ ద్వారా.. సూచనలను పంపుతూ.. దూరంగా ఉండి భద్రతా బలగాలు ఆపరేషన్ చేయొచ్చు.

లాబ్రడార్ల స్థానంలో బెల్జియన్ మాలినోయిస్ జాగిలాలు.. వాడనున్న NSG.. ప్రత్యేకతలేంటో తెలుసా?

Belgian Malinois

ఇట్టే పట్టేస్తాయి. శత్రువుల ఆటకట్టిస్తాయి. ఆ డాగ్స్ పంజా విసిరితే.. శత్రువు గుండె గుబేల్ అనాల్సిందే. భద్రతా బలగాల దగ్గరున్న జాగిలాలు అంత పటిష్టంగా ఉంటాయి. భద్రతలో బలగాలకు ధీటుగా కీలకపాత్ర పోషిస్తున్నాయి జాగిలాలు.. నిందితులను పట్టుకోవడం, మందుపాతరలను కనిపెట్టడంలో జాగిలాల వాడకం రోజురోజుకు పెరిగిపోతుంది.

ప్రతికూల పరిస్థితుల్లో కూడా నేరం జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను కనిపెట్టడం, లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులపై దాడి చేయడం జగిలాలు చేసేపని. అయితే ఈ పనులు చేయడానికి వాటికి జాగిలాలకు బాగానే శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. శిక్షణే కాదు జాగిలాల బ్రీడ్స్ ఎంపిక కూడా కీలకంగా మారింది. కొన్ని రకాల డాగ్స్ విధుల్లో ఆశించిన దాని కంటే పటిష్టంగా పనిచేస్తున్నాయి. దాంతో బలగాల పని ఈజీ అవుతుంది

మరింత సమర్థవంతంగా
ప్రస్తుతం మన NSGలో లాబ్రడార్లు బ్రీడ్ జాగిలాలు కీరోల్ ప్లే చేస్తున్నాయి. వాటి స్థానంలో బెల్జియన్ జాతి కుక్కలు వచ్చి చేరనున్నాయి.. అందులో మాలినోయిస్ రకం కుక్కలు అయితే మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని భావిస్తున్నారు NSG అధికారులు. ఈ బెల్జియన్ మాలినోయిస్ బ్రీడ్ ను బెల్జియంలో అభివృద్ధి చేశారు.

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్దంలో భాగంగా బెల్జియన్ మాలినోయిస్ జాగిలాలను స్క్వాడ్ లోకి దించింది ఇజ్రాయెల్. గాజాలోని హమాస్ మిలిటెంట్లను పసిగట్టడానికి, వారిని ట్రాక్ చేసి దాడి చేయడానికి బెల్జియన్ మాలినోయిస్ జాతి కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. హమాస్ మిలిటెంట్ల హతంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.

భారత యాంటీ టెర్రరిజం వింగ్, NSG కూడా.. బెల్జియన్ మాలినోయిస్ జాతి కుక్కలను తమ టీమ్‌లోకి తీసుకోవాలని భావిస్తున్నాయి.. మన భద్రతా బలగాల స్క్వాడ్ లో లాబ్రడార్స్, కాకర్ స్పానియల్స్, బెల్జియన్ మాలినోయిస్ అనే మూడు రకాల జాగిలాలు ఉన్నాయి. ప్రస్తుతమున్న 20 లాబ్రడార్ల వయస్సు 4 నుంచి 7 సంవత్సరాలు. వాటిని క్రమంగా రిటైర్ చేయాలని ప్లాన్ చేస్తోంది NSG. లాబ్రడార్ల స్థానంలో 14 మాలినోయిస్‌లను కొనుగోలు చేశారు. వాటికి శిక్షణ ఇవ్వడం కూడా మొదలుపెట్టారు.

టార్గెట్‌ను ఛేదించడంలో చురుకు
బెల్జియన్ మాలినోయిస్ జాతి కుక్కలు టార్గెట్ ను ఛేదించడంలో చురుకుగా ఉంటాయి. లాబ్రడార్ బ్రీడ్ కంటే ఇవి అత్యంత తెలివైనవి.. క్రూరమైనవి.. ఇతర జాతులతో పోలిస్తే ఇవి మరింత అప్రమత్తంగా ఉంటాయి.. పాకిస్తాన్‌లో అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ ను మాలినోయిస్ కుక్కలే పట్టుకున్నాయి. సిరియాలో పరారీలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ నాయకడు అబూ బకర్ అల్-బాగ్దాదీ మరణానికి దారితీసిన యుఎస్ నేతృత్వంలోని సైనిక చర్యలో బెల్జియన్ మాలినోయిస్ ముఖ్యమైన పాత్ర పోషించాయి. నాటో దళాలు కూడా బెల్జియన్ మాలినోయిస్ ఉపయోగించాయి.

సాధారణంగా లాబ్రడార్లను స్నిఫింగ్, ట్రాకింగ్ కోసం.. జర్మన్ షెపర్డ్‌లను దాడి చేయడానికి ఉపయోగిస్తోంది NSG.. ఇప్పుడు స్నిఫ్, ట్రాక్, అటాక్ అనే మూడు పనులు చేసేలా మాలినోయిస్ కుక్కలకు ట్రైనింగ్‌ ఇస్తున్నారు.. 2023 ఆగస్ట్ నుంచే శిక్షణ ఇస్తున్న ఈ డాగ్స్‌ను NSG బ్లాక్ క్యాట్ కమాండోలు చేపట్టే ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ఉపయోగించనున్నారు..

లాబ్రడార్ల మాదిరిగా కాకుండా, బెల్జియన్ మాలినోయిస్ కుక్కలు షార్ప్ గా ఉంటాయి. సైలెంట్ గా పనికానిచ్చేస్తాయి. ఉగ్రవాదుల ఆపరేషన్ లో బెల్జియన్ మాలినోయిస్ కుక్కల సక్సెస్ రేటు ఎక్కువగా ఉంది. భద్రతాదళాలకు దారిచూపి.. సేఫ్ రూట్ లో శత్రువును టార్గెట్ చేయడంలో ఉపయోగపడుతాయి. లాబ్రడార్లు అయితే త్వరగా అలసిపోతాయి.

ఈ బెల్జియన్ మాలినోయిస్ జాతి కుక్కలను బెల్జియంలోని మాలిన్స్ ప్రాంతంలో అభివృద్ధి చేశారు. ఒక టార్గెట్ ను ఫిక్స్ చేస్తే.. హ్యాండ్లర్లతో పనిలేకుండా బెల్జియన్ మాలినోయిస్ కుక్క దానిని పసిగడుతుంది. దాంతో సైనికుడికి రిస్క్ ఉండదు. ప్రమాదం కూడా తగ్గుతుంది. బెల్జియన్ మాలినోయిస్ డాగ్స్ కు టెక్నాలజీ జోడిస్తే మరింత అద్భుతమైన ఫలితాలు సాధించొచ్చని చెబుతున్నారు NSG అధికారులు.

కుక్కకు కెమెరా పెట్టి రిమోట్ డెలివరీ సిస్టమ్స్ ద్వారా.. సూచనలను పంపుతూ.. దూరంగా ఉండి భద్రతా బలగాలు ఆపరేషన్ చేయొచ్చు. రిమోట్ ఆపరేషన్‌, రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్ రావడానికి బెల్జియన్ మాలినోయిస్ డాగ్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇలా అన్నింట్లోనూ బెల్జియన్ మాలినోయిస్ కుక్కలు సమర్థవంతంగా పనిచేస్తాయి. అందుకే ఈ బ్రీడ్ డాగ్స్ నే వాడాలని నిర్ణయించింది NSG. త్వరలోనే లాబ్రడార్లు బ్రీడ్ జాగిలాల స్థానంలో బెల్జియన్ మాలినోయిస్ కుక్కలు పూర్తిస్థాయిలో ఆపరేషన్ లో పాల్గొననున్నాయి.

Important Entrance Exams : మార్చి-ఏప్రిల్ 2024లో జరగబోయే ముఖ్యమైన ప్రవేశ పరీక్షలివే.. ఇదిగో ఫుల్ లిస్ట్ మీకోసం..!