Rahul Gandhi: ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లకు రాహుల్ గాంధీ డిమాండ్..

ఈ ప్రభుత్వం మీ గురించి కాదు, అదానీ-అంబానీల గురించి మాత్రమే పట్టించుకుంటుంది..

Rahul Gandhi: ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లకు రాహుల్ గాంధీ డిమాండ్..

Updated On : May 16, 2025 / 7:00 PM IST

Rahul Gandhi: ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు రిజర్వేషన్లు విస్తరించే వరకు పోరాటం చేస్తానని రాహుల్ తేల్చి చెప్పారు. గురువారం బీహార్ దర్భంగాలో రాహుల్ మాట్లాడారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.

“ప్రైవేట్ సంస్థలలో రిజర్వేషన్ల కోసం నేను డిమాండ్ చేస్తాను. మీరు మీ దృష్టి నుండి దృష్టి మరల్చకుండా, మీ హక్కులను పొందేలా నేను చూసుకుంటాను. మీరందరూ మీ బలాన్ని అర్థం చేసుకోవాలి” అని రాహుల్ గాంధీ అన్నారు.

Also Read: మళ్లీ కోవిడ్ కలకలం.. సింగపూర్, హాంగ్‌కాంగ్‌లో పెరిగిన కేసులు, అప్రమత్తమైన అధికారులు..

“మీరు కుల గణన నిర్వహించాలని పార్లమెంటులో ప్రధాని మోదీని అడిగా. ప్రజల ఒత్తిడి భయం కారణంగా, దేశంలో కులగణనను మోదీ ప్రకటించారు. కానీ నిజం ఏంటంటే కుల గణన రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారు మోదీ. ఈ ప్రభుత్వం మీ గురించి కాదు, అదానీ-అంబానీల గురించి మాత్రమే పట్టించుకుంటుంది” అని ప్రధాని మోదీపై మండిపడ్డారు రాహుల్ గాంధీ.

అంతకుముందు, దర్భంగాలోని అంబేద్కర్ హాస్టల్‌కు వెళుతుండగా రాహుల్ ను పోలీసులు ఆపారు. అక్కడ ఆయన విద్యార్థులతో మాట్లాడాల్సి ఉంది. ”బీహార్ పోలీసులు నన్ను ఆపడానికి ప్రయత్నించారు కానీ నా వెనక దేశ యువత ఉన్నందున వారు అలా చేయలేకపోయారు” అని రాహుల్ గాంధీ అన్నారు.