Rs 2 Core: జట్టు సరిగ్గా కత్తిరించని సెలూన్‌కు రూ. 2కోట్ల నష్టపరిహారం

జుట్టు సరిగ్గా కత్తిరించకుండా తన ఉపాధికి ఇబ్బంది కలిగేలా చేసినందుకు నేషనల్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.

Rs 2 Core: జట్టు సరిగ్గా కత్తిరించని సెలూన్‌కు రూ. 2కోట్ల నష్టపరిహారం

Hair Cut

Updated On : September 24, 2021 / 12:48 PM IST

Rs 2 Crore Compensation: జుట్టు సరిగ్గా కత్తిరించకుండా తన ఉపాధికి ఇబ్బంది కలిగేలా చేసినందుకు నేషనల్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. ఆష్నా రాయ్ మహిళకు రూ.2కోట్ల పరిహారం అందివ్వాలని ఆదేశించింది. 2018లో హోటల్ ఐటిసి మౌర్యలోని ఒక సెలూన్‌లో సిబ్బంది జుట్టును తప్పుగా కత్తిరించారు. జుట్టు ఉత్పత్తులకు మోడల్ అయిన ఆమెకు “దాదాపు జుట్టు లేకుండా” చేసినందుకు ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

జస్టిస్ ఆర్‌కె అగర్వాల్ మరియు డాక్టర్ ఎస్‌ఎమ్ కాంతికర్ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంధర్భంగా “మహిళలు తమ జుట్టు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారనడంలో సందేహం లేదు” మరియు “జుట్టును మంచి స్థితిలో ఉంచడానికి బాగా ఖర్చు చేస్తారు”. అని చెప్పుకొచ్చారు.

జుట్టుతో మానసికంగా వారికి చాలా అనుబంధం ఉంటుందని, జుట్టు ఉత్పత్తులకు మోడల్ అయిన ఆమె పొడవాటి జుట్టును కోల్పోవడం కారణంగా చాలా నష్టపోయింది. ఆమె VLCC మరియు Pantene వంటి కంపెనీలకు మోడలింగ్ చేసింది. కానీ వ్యతిరేక పార్టీ నెం. 2 (ఐటిసి హోటల్స్ లిమిటెడ్) వల్ల ఆమె జుట్టు కత్తిరించడంలో తప్పుల వల్ల పనులను కోల్పోయిందని, అందువల్ల భారీ నష్టాన్ని చవిచూసినట్లు, దీని వల్ల ఇది ఆమె జీవనశైలిని పూర్తిగా మారిపోయిందని, టాప్ మోడల్ కావాలనే ఆమె కల ఛిద్రం అయినట్లుగా ఆమె చెప్పింది.

ఈ క్రమంలోనే సెలూన్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మానసిక వేధనకు, ఒత్తిడికి గురయ్యానంటూ.. తీవ్ర ఇబ్బంది పడినట్లుగా ఆమె కన్స్యూమర్స్ కోర్టును ఆశ్రయించింది. సదరు హెయిర్ సెలూన్‌పై రూ. 3 కోట్ల నష్ట పరిహారం ఇప్పించాలని కోరింది. ఫిర్యాదును పరిశీలించిన కన్స్యూమర్స్ కోర్టు.. సెలూన్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే జుట్టు నష్టపోయిందని, గుర్తించి బాధితురాలికి రూ. 2 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా నష్టపరిహారం చెల్లించాలని కోర్టు వారిని ఆదేశించింది.