Karnataka Assembly: కర్ణాటకలో కలకలం.. కత్తితో అసెంబ్లీకి వచ్చిన మహిళ.. తరువాత ఏం జరిగిందంటే?

కర్ణాటక అసెంబ్లీకి ఓ మహిళ బ్యాగులో కత్తితో వచ్చింది. భద్రతా సిబ్బంది గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Karnataka Assembly: కర్ణాటకలో కలకలం.. కత్తితో అసెంబ్లీకి వచ్చిన మహిళ.. తరువాత ఏం జరిగిందంటే?

Karnataka assembly

Updated On : July 10, 2023 / 2:02 PM IST

Karnataka: కర్ణాటకలో ఓ మహిళ కత్తితో అసెంబ్లీకి వచ్చింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బందిని మహిళను అదుపులోకి తీసుకొని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళను పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. అయితే, కత్తితో అసెంబ్లీకి వచ్చిన మహిళ ఆసెంబ్లీ మహిళా ఉద్యోగి అని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై పోలీసులు వివరాలు ఏమీ తెలపలేదు. మహిళను విచారణ అనంతరం ఆమె ఎవరు.. కత్తితో అసెంబ్లీకి ఎందుకు వచ్చింది అనే విషయాలు బహిర్గతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Karnataka Assembly : ఎమ్మెల్యేనంటూ కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో 72 ఏళ్ల వ్యక్తి హల్ చల్ .. ఏం చేశాడో తెలుసా..?

కర్ణాటక అసెంబ్లీలో గత వారం బడ్జెట్ సమావేశాల సమయంలో ఓ వ్యక్తి అసెంబ్లీలోకి ప్రవేశించి ఎమ్మెల్యే సీట్లో కూర్చున్నాడు. జేడీఎస్ కు చెందిన మెమ్మెల్యే కరియమ్మ కూర్చోవాల్సిన సీటులో గుర్తు తెలియని వ్యక్తి కూర్చోవడంతో అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. మార్ష్‌ల్స్ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తికి 70ఏళ్లు. విజిటర్స్ పాస్ సంపాదించి లోపలికి ప్రవేశించినట్లు అసెంబ్లీ భద్రతా సిబ్బంది గుర్తించారు.

Karnataka Govt Excise Duty : మద్యంపై ఎక్సైజ్ సుంకం పెంచిన ప్రభుత్వం

ఆ ఘటన తరువాత అసెంబ్లీలో భద్రతను పటిష్టం చేశారు. ప్రతీ ఒక్కరికి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోపలికి పంపిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అసెంబ్లీ వద్దకు వచ్చిన మహిళను భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. అయితే, ఆమె వద్ద ఉన్న బ్యాగులో కత్తిని గుర్తించారు. మహిళ తూర్పు ద్వారం గుండా లోపలికి వస్తుండగా అక్కడున్న సిబ్బంది ఆమెను తనిఖీ చేశారు. ఆమె బ్యాగ్ ను స్కానింగ్ మెషిన్ లోకి పంపగా అందులో ప్రమాదకర వస్తువు ఉన్నట్లు సిగ్నల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బ్యాగును తనిఖీ చేయగా అందులో కత్తి ఉంది. దీంతో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.