Chicken : భర్త చికెన్ తిన్నాడని ఆత్మహత్యచేసుకున్న భార్య

శ్రావణమాసంలో చికెన్ తినొద్దని వారించినా భర్త వినకపోవడంతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది.

Chicken : భర్త చికెన్ తిన్నాడని ఆత్మహత్యచేసుకున్న భార్య

Chicken

Updated On : August 24, 2021 / 4:51 PM IST

Chicken : శ్రావణమాసంలో భర్త చికెన్ తిన్నాడని.. ఓ మహిళ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఛత్తీస్​గఢ్ సూరజ్​పుర్​లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరౌదా గ్రామానికి చెందిన రామజన్మ, మనీషా సింగ్ (19) భార్యాభర్తలు.. ఆదివారం రక్షాబంధన్ కావడంతో బంధువుల ఇంటికి వెళ్లివచ్చారు.

సాయంత్రం సమయంలో తమ ఇంటికి సమీపంలోని అత్త ఇంటికి వెళ్లారు రామజన్మ, మనీషా. అక్కడ రామజన్మ చికెన్ తింటుంటే భార్య వద్దని వారించింది. శ్రావణమాసం చివరి రోజు తినకూడదని.. రేపటి నుంచి తినమని చెప్పింది. అయినా భర్త వినకుండా చికెన్ తినడంతో అక్కడి నుంచి ఇంటికివెళ్ళిన మనీషా మనస్తాపానికి గురై వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పుపెట్టుకుంది.

అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్త ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. శరీరం పూర్తిగా కాలిపోయింది. వెంటనే ఆమెను అంబికాపుర్​ మెడికల్​ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ ఆమె చికిత్స పొందుతూ మరణించింది.