Ahmedabad : మహిళా కానిస్టేబుల్ మంచి పని.. వీడియో వైరల్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజనులు

ఓ మహిళా కానిస్టేబుల్ తన 6 నెలల చిన్నారితో పరీక్ష రాయడానికి వచ్చింది. పరీక్ష మొదలయ్యే సమయానికి చిన్నారి ఏడుపు మొదలుపెట్టాడు. పరిస్థితి గమనించిన మరో మహిళా కానిస్టేబుల్ ఆమె పరీక్ష రాస్తున్నంత సేపు ఆ చిన్నారిని చక్కగా చూసుకుంది. తోటి కానిస్టేబుల్‌కి సాయపడిన ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Ahmedabad : మహిళా కానిస్టేబుల్ మంచి పని.. వీడియో వైరల్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజనులు

Ahmedabad

Updated On : July 11, 2023 / 3:25 PM IST

Ahmedabad : ఓ మహిళా కానిస్టేబుల్ తన 6 నెలల కొడుకుతో కలిసి ‘గుజరాత్ హైకోర్టు ప్యూన్ రిక్రూట్ మెంట్’ పరీక్ష రాయడానికి వచ్చింది. ఆమె పరీక్ష అయ్యేవరకూ చిన్నారిని కంటికి రెప్పలా చూసుకుంది మరో మహిళా కానిస్టేబుల్. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kalyani Railway Station : మహిళా కానిస్టేబుల్ సమయస్ఫూర్తి.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికురాలు

అహ్మదాబాద్‌లోని ఓధవ్‌లో గుజరాత్ ‘హైకోర్టు ప్యూన్ రిక్రూట్ మెంట్’ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు ఓ మహిళా కానిస్టేబుల్ తన 6 నెలల చిన్నారితో కలిసి వచ్చింది. ఓ వైపు పరీక్ష మొదలు అవుతుంటే చిన్నారి ఏడుపు మొదలుపెట్టాడు. ఆ పరిస్థితుల్లో పరీక్ష రాయడం అంటే ఆమెకు సవాల్ లాంటిది. ఇక పరిస్థితిని గమనించిన కానిస్టేబుల్ దయా బెన్ రంగంలోకి దిగి ఆ చిన్నారిని తన దగ్గరకు తీసుకుని ఆమె పరీక్షకు హాజరయ్యేందుకు సాయం చేసింది. కానిస్టేబుల్ చిన్నారితో ఆడుకుంటున్న ఫోటోలు అహ్మదాబాద్ పోలీసులు ట్విట్టర్ అకౌంట్ లో (@AhmedabadPolice) షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.

RPF woman constable : రైల్వే ట్రాక్‌పై బలవన్మరణానికి ప్రయత్నించాడు.. మెరుపులా దూకి కాపాడిన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్

‘అహ్మాదాబాద్ లోని ఓధవ్ లో పరీక్షలు రాస్తున్న ఓ తల్లికి దయా అనే మహిళా కానిస్టేబుల్ సాయం చేసింది. చిన్నారి ఏడుపు ప్రారంభించినప్పుడు దయా రంగంలోకి దిగి ఆ మహిళ పరీక్షలు రాయడానికి సహాయం చేసింది’ అనే శీర్షికతో వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ‘చాలా ధన్యవాదాలు సోదరి’ అని..’ఒకరికొకరు సాయం చేసుకుంటూ సమాజం నుంచి ప్రశంసలు అందుకున్నారు’ అంటూ కామెంట్లు చేసారు. నిజంగా దయా బెన్ గ్రేట్ పోలీస్ స్టేబుల్.