Cuts Rapist Genitals : అర్థరాత్రి ఇంట్లోకి దూరి అత్యాచారం చేయబోతే.. దాన్ని కొడవలితో కోసేసింది
తనపై అత్యాచారానికి ప్రయత్నించిన ఓ కామాంధుడికి మహిళ గుణపాఠం చెప్పింది. జీవితాంతం బాధ పడే విధంగా తగిన శాస్తి చేసింది. భర్తలేని సమయంలో అర్థరాత్రి ఇంట్లోకి దూరిన మృగాడు ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. మృగాడితో 20 నిమిషాలపాటు పెనుగులాడిన బాధితురాలు.. చివరికి అతడి నుంచి తప్పించుకుంది. మంచం కిందున్న కొడవలిని తీసుకుని అతడి మర్మాంగాలను

Woman Cuts Off Rapist Genitals
woman cuts off rapist genitals : తనపై అత్యాచారానికి ప్రయత్నించిన ఓ కామాంధుడికి మహిళ గుణపాఠం చెప్పింది. జీవితాంతం బాధ పడే విధంగా తగిన శాస్తి చేసింది. భర్తలేని సమయంలో అర్థరాత్రి ఇంట్లోకి దూరిన మృగాడు ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. మృగాడితో 20 నిమిషాలపాటు పెనుగులాడిన బాధితురాలు.. చివరికి అతడి నుంచి తప్పించుకుంది. మంచం కిందున్న కొడవలిని తీసుకుని అతడి మర్మాంగాలను కోసేసింది. అనంతరం అంత రాత్రిలోనూ ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ సంచలన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గురువారం(మార్చి 18,2021) రాత్రి జరిగింది. లోని గ్రామంలో గురువారం రాత్రి జరిగింది.
సిధి జిల్లా ఖాడ్డీ పోలీస్ స్టేషన్ పరిధి ఉమరిహా గ్రామానికి చెందిన మహిళ (45) భర్త పని మీద వేరే ప్రాంతానికి వెళ్లాడు. దీంతో ఆమె తన 13ఏళ్ల కొడకుతో ఇంట్లో ఉంది. ఈ సమయంలో అర్థరాత్రి వేళ ఓ వ్యక్తి ఆమె ఇంట్లోకి దూరాడు. అతడిని దొంగగా భావించిన ఆమె కుమారుడు ఇరుగు పొరుగువారిని పిలవడానికి బయటకు పరుగులు తీశాడు. ఆమె మాత్రం ఇంట్లోనే ఇరుక్కుపోయింది. అయినప్పటికీ భయపడకుండా ఎదురుతిరిగింది. అతడిని బయటకు పంపేందుకు పోరాడింది. ఇదే సమయంలో ఒంటిరిగా ఉన్న ఆమెను కొట్టి బలాత్కారం చేయబోయాడు ఆ నీచుడు.
కామాంధుడి బారి నుంచి రక్షించుకోడానికి బాధితురాలు దాదాపు 20 నిమిషాలపాటు పెనుగులాడింది. అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మంచం కింద ఉన్న కొడవలి తీసుకుని అతడి మర్మాంగాలను కోసేసింది. అనంతరం అర్థరాత్రి 1.30 గంట ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. అతడిపై కేసు పెట్టింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. ప్రస్తుతం మరో ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నారు. నిందితుడిపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పోలీసులు. కాగా, నిందితుడు కూడా మహిళపై కేసు పెట్టాడు. తనపై దాడి జరిగిందని, తీవ్ర గాయాల పాలయ్యానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరూ పరస్పరం కేసులు పెట్టుకున్నారని, ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.