ఒకే కాన్పులో ఆరుగురు.. ఆనందించేలోపే

  • Published By: veegamteam ,Published On : March 2, 2020 / 03:28 AM IST
ఒకే కాన్పులో ఆరుగురు.. ఆనందించేలోపే

Updated On : March 2, 2020 / 3:28 AM IST

సాధారణంగా పిల్లల విషయంలో ‘ఇద్దరు వద్దు.. ఒక్కరే ముద్దు’ అనే నినాదం నడుస్తుంది.. చాలామంది దాన్ని పాటిస్తున్నారు కూడా. అయితే కొంతమందికి ఒకే కాన్పులో ఎక్కువమంది పుట్టడం జరుగుతోంది. ఒకే కాన్పులో ఒక్కరిద్దరు లేదా ముగ్గురు పుట్టడం చూస్తుంటాం. కానీ, మధ్యప్రదేశ్‌లోని షివోపూర్‌ జిల్లాకు చెందిన మహిళ మాత్రం ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చింది. 

ఆమె పేరు మూర్తి మాలే (22), ఈ మహిళకు శనివారం (ఫిబ్రవరి 29, 2020)న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే కాన్పులో ఆరుగురు శిశువులు జన్మించారు. ఆరుగురు శిశువులలో నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఒకే కాన్పులో ఆరుగురు శిశువులు జన్మించారని ఆనందించే లోపే.. విషాదం నెలకొంది. తక్కువ బరువు ఉండటంతో ఇద్దరు అమ్మాయిలు పుట్టిన కాసేపటికే మరణించారు.

మిగిలిన నలుగురికి ఇంటెన్సివ్‌ కేర్‌ లో చికిత్స అందిస్తున్నారు. ఆరుగురు శిశువుల మొత్తం బరువు కలిపితే కేవలం 3.65 కేజీలు మాత్రమే. వింతేంటంటే.. ఆ మహిళకు నార్మల్ డెలివరీ అయిందని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. తల్లి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని చెప్పారు. .(బాలికను గ్యాంగ్ రేప్ చేసి చెట్టుకి ఉరితీసిన పదో తరగతి విద్యార్థులు దొరికారు)