Viral Video: అయ్య బాబోయ్.. రైలు కన్నా ఫాస్ట్‌గా పరిగెత్తాలని ఈ అమ్మాయి ఏం చేసిందో చూడండి..

ఈ వీడియోలో ఆమె పట్టాలకు చాలా దగ్గరగా ఉన్న చోటు నుంచి పరిగెత్తింది.

Viral Video: అయ్య బాబోయ్.. రైలు కన్నా ఫాస్ట్‌గా పరిగెత్తాలని ఈ అమ్మాయి ఏం చేసిందో చూడండి..

Updated On : April 14, 2025 / 5:02 PM IST

సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడానికి యువత నిత్యం ఎదో ఒకటి చేస్తూనే ఉంటారు. కొన్ని ఫన్నీగానే ఉంటాయి. మరికొన్ని నెటిజన్స్ నుంచి తిట్లుతినేలా ఉంటాయి. కొందరు క్రియేటర్లు విపరీత చేష్టలతో వీడియోలు తీసుకుంటూ చట్టపరంగానూ సమస్యలు ఎదుర్కొంటున్నారు.

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం తాజాగా ‘పికు సింగ్’ అనే ఓ ఇన్‌ఫ్లూయెన్సర్‌ రైలు పట్టాల పక్కన రైలుతో పోటీపడుతూ పరిగెత్తుతూ వీడియో తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫిట్‌నెస్ కోసం విభిన్న ప్రదేశాలలో రన్నింగ్ చేసే వీడియోలను అప్లోడ్ చేస్తూ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లూయెన్సర్ గా ‘పికు సింగ్’ పాపులర్ అయింది. ఈ సారి మాత్రం ప్రాణాలతో చెలగాటమాడుతూ వీడియో తీసుకుంది. “రైలుతో కలిసి పరిగెత్తడం” అని క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన వెంటనే నెటిజన్లు ఆ యువతిపై విమర్శలు చేస్తున్నారు.

ఈ వీడియోలో ఆమె పట్టాలకు చాలా దగ్గరగా ఉన్న చోటు నుంచి పరిగెత్తింది. సింగ్ పరిగెడుతున్న సమయంలో ఆమె పక్కనే రైలు చాలా వేగంగా దూసుకుపోయింది. చిన్న పొరపాటు జరిగినా లేదా అదుపు తప్పినా తీవ్ర ప్రమాదం సంభవిస్తుంది.

నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్‌ అయ్యారు. ఇంకెప్పుడూ ఇలా చేయకూడదని పికు సింగ్‌కు చివాట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కంటెంట్ సమాజానికి ఉపయోగకరంగా ఉండాలి కానీ, ఇలా ప్రమాదకరంగా ఉండకూడదు.

 

View this post on Instagram

 

A post shared by Piku Singh (@runfitpiku)

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్ డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్ ని ఫాలో అవ్వండి