Wife beating Husband: జిమ్‌లో రెడ్ హ్యాండెడ్‌గా గర్ల్ ఫ్రెండ్‌తో దొరికిన భర్త.. ఇద్దరి జుట్లు పట్టుకుని

భర్తకు అఫైర్ ఉందని తెలిసి.. నిఘా పెట్టింది. ఇద్దరూ జిమ్ లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చెప్పుతో చితకబాదింది.

Wife beating Husband: జిమ్‌లో రెడ్ హ్యాండెడ్‌గా గర్ల్ ఫ్రెండ్‌తో దొరికిన భర్త.. ఇద్దరి జుట్లు పట్టుకుని

Wife Gym Bhopal

Updated On : October 19, 2021 / 9:40 AM IST

Wife beating Husband: భర్తకు అఫైర్ ఉందని తెలిసి.. నిఘా పెట్టింది. ఇద్దరూ జిమ్ లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చెప్పుతో చితకబాదింది. భోపాల్‌లోని కోహ్ ఏ ఫిజా అనే ప్రాంతంలో అక్టోబర్ 15న ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు కావడంతో వైరల్ అయింది.

ఆ వీడియోలో మహిళ భర్తని, అతని గర్ల్ ఫ్రెండ్ పై దాడి చేసి చెప్పుతో కొడుతున్నవి రికార్డ్ అయ్యాయి. ఘటనపై ఇరు వైపుల వారు భోపాల్ పోలీసులను ఆశ్రయించారు.

‘మహిళకు అనుమానం రావడంతో అక్కను తీసుకుని భర్త జిమ్ చేసే చోటుకు వెళ్లింది. అక్కడ గర్ల్ ఫ్రెండ్ తో పాటు మరికొందరితో కనిపించాడు భర్త. ఇక అంతే కోపంతో ఊగిపోయింది. దాడికి దిగి చేతిలోకి చెప్పునే ఆయుధంగా తీసుకుని కొద్ది నిమిషాల పాటు చితకబాదుతూనే ఉంది. ఘటన జరిగిన కాసేపటికే ఇరు వర్గాల వారు స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు’ అని పోలీసులు తెలిపారు.

తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్తున్న అమ్మాయి ఎవరో తనకు తెలియదని.. చెప్పుకొస్తున్నాడు భర్త. దీనిపై విచారణ జరుపుతున్నామని స్టేషన్ అధికారి అన్నారు. అంతకంటే ముందు భర్తపై వరకట్న వేదింపులు, వేధిస్తున్నాడంటూ కేసు నమోదు చేసింది భార్య. అప్పట్నుంచి ఆమె పుట్టింటికే మకాం మార్చేసిందట.