Delhi Woman : 2006లో కిడ్నాపైన మహిళ.. 17 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రత్యక్షం

తాజాగా సదరు మహిళను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు ఆమె వయసు 32 సంవత్సరాలు అని తెలిపారు.

Delhi Woman : 2006లో కిడ్నాపైన మహిళ.. 17 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రత్యక్షం

Delhi Police

Updated On : May 26, 2023 / 4:22 PM IST

Delhi Woman Found : దేశ రాజధాని ఢిల్లీలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల క్రితం కిడ్నాప్ (Kidnap) కు గురైన ఓ మహిళ హస్తినలో ప్రత్యక్షమైంది. ఈ విషయాన్ని గురువారం ఢిల్లీ గోకల్ పురి (Gokul Puri) పోలీసులు వెల్లడించారు. డీసీపీ రోహిత్ మీనా తెలిపిన వివరాల ప్రకారం… 2006లో సదరు మహిళను కిడ్నాప్ చేశారు. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మహిళ తల్లిందండ్రుల ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని గోకుల్ పురి పోలీస్ స్టేషన్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 363 కింద కేసు నమోదు చేశారు. తాజాగా సదరు మహిళను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు ఆమె వయసు 32 సంవత్సరాలు అని తెలిపారు. మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా.. కిడ్నాప్ తర్వాత చోటు చేసుకున్న పరిస్థితులను పోలీసులకు ఆమె వివరించారు.

Mahender Kaur – Sheikh Abdul : విడిపోయిన అక్కాతమ్ముుడు 75ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.. అక్క భారత్ లో.. తమ్ముడు పాకిస్థాన్ లో

ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లా చెర్దీ గ్రామంలో దీపక్ అనే వ్యక్తితో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. లాక్ డౌన్ సమయంలో తలెత్తిన వివాదాల కారణంగా ఇద్దరూ విడిపోయినట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఆమె గోకుల్ పురి ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నట్లు తెలిపారు.