Nirmala Sitaraman: వంటగ్యాస్ ధర తగ్గించాలంటూ కేంద్ర మంత్రిని చుట్టు ముట్టిన మహిళలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా స్థానికులతో మమేకమై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలు వారికి అందాయా అని ప్రశ్నించారు. ఆ సమయంలోనే ఆమెను మహిళలు చుట్టుముట్టారు. మహిళలు ప్రశ్నలకు సమాధానమిస్తూ... వంటగ్యాస్ ధరను అంతర్జాతీయ మార్కెట్ నిర్ణయిస్తుందని తెలిపారు

Nirmala Sitaraman
Nirmala Sitaraman: తమిళనాడులో కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌కు మహిళలు షాక్ ఇచ్చారు. 2024 ఎన్నికల ప్రచారం కోసం ‘‘వాల్ టు వాల్’’ ప్రచారాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర మంత్రి ఎల్ మురుగన్‌తో కలిసి నిర్మలా సీతారామన్ రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా పజైయసీవరం గ్రామాన్ని సందర్శించినపుడు మహిళలు ఆమెను చుట్టుముట్టారు. వంటగ్యాస్ ధరను తగ్గించాలని నిర్మలా సీతారామన్‌ను చుట్టుముట్టిన నిలదీశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా స్థానికులతో మమేకమై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలు వారికి అందాయా అని ప్రశ్నించారు. ఆ సమయంలోనే ఆమెను మహిళలు చుట్టుముట్టారు. మహిళలు ప్రశ్నలకు సమాధానమిస్తూ… వంటగ్యాస్ ధరను అంతర్జాతీయ మార్కెట్ నిర్ణయిస్తుందని తెలిపారు.
Social Justice Meet: స్టాలిన్ ఏర్పాటు చేసిన ‘సామాజిక న్యాయం’ సమావేశం.. మోదీ వేవ్‌ని అడ్డుకుంటుందా?
‘‘మన దేశంలో వంట గ్యాస్ లేదు. కేవలం దిగుమతి చేసుకుంటున్నాం. అక్కడ ధర పెరిగితే, ఇక్కడ కూడా పెరుగుతోంది. అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుతోంది. కానీ గత రెండేళ్లలో పెద్దగా ధర తగ్గలేదు’’ అని మహిళలకు కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. మొత్తం మీద మహిళలు వంటగ్యాస్ ధరలపై కేంద్రమంత్రిని నిలదీశారు. ఆ తర్వాత ఆమె బీజేపీ కార్యకర్త నివాసానికి వెళ్లి అక్కడ కమలం గుర్తుకు రంగులు వేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.